మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ
2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ద్వారా మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా విశేష స్పందన లభిస్తున్నది. కామారెడ్డి జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు గాను వ్యాప్తంగా ఇప్పటి వరకు 171 దరఖాస్తులు వచ్చాయి. గురువారం ఒక్కరోజే 105 దరఖాస్తులు రావడం గమనార్హం.
- గురువారం ఒక్క రోజే 130 టెండర్లు
- ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో 171 దరఖాస్తులు
- నిజామాబాద్ జిల్లాలో 54 టెండర్లు దాఖలు
మద్యం దుకాణాలకు గురువారం దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 130 టెండర్లు దాఖలయ్యాయి. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 171 దరఖాస్తులు రాగా, నిజామాబాద్ జిల్లాలో 54 వచ్చాయి. ఈ నెల 18 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండగా, అదృష్టం పరీక్షించుకునేందుకు చాలా మంది సిద్ధమవుతున్నారు. దీంతో ఈసారి భారీగానే టెండర్లు వచ్చే అవకాశమున్నది.
కామారెడ్డి ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ)/నిజామాబాద్ క్రైం : 2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ద్వారా మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా విశేష స్పందన లభిస్తున్నది. కామారెడ్డి జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు గాను వ్యాప్తంగా ఇప్పటి వరకు 171 దరఖాస్తులు వచ్చాయి. గురువారం ఒక్కరోజే 105 దరఖాస్తులు రావడం గమనార్హం. ఈనెల 18 వరకు దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 57, దోమకొండ 55, ఎల్లారెడ్డి పరిధిలో 10, బాన్సువాడ 44, బిచ్కుంద పరిధిలో 5 దరఖాస్తులు వచ్చాయి.
నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలో ప్రొహిబిషన్,ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ పి.దశరథం పర్యవేక్షణలో సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల ఈఎస్ కార్యాలయంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్, మోర్తాడ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 102 మద్యం షాపులకు టెండర్లు నిర్వహిస్తున్నారు. గురువారం రోజు 25 అప్లికేషన్లు అందాయి. ఇప్పటి వరకు మొత్తం 54 దరఖాస్తులు వచ్చాయి.
18 వరకు అవకాశం..
జిల్లాలోని వివిధ రంగాల్లో ఉన్న వ్యాపారులు ఈనెల 18 వరకు మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్. రవీంద్ర రాజు తెలిపారు. దరఖాస్తు విధానం ఎంతో సులభమన్నారు. ఇప్పటికే 155 దరఖాస్తులు వచ్చాయి.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

