369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్ నోటిఫికేషన్.. హైదరాబాద్‌లోనూ ఖాళీలు
UPSC | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS)-II పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైనవారు వచ్చేనెల 7 వరకు ఆన్లైన్
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS)-II పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైనవారు వచ్చేనెల 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 339 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కూడా ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తిచేసినవారు అప్లయ్ చేయడానికి అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది.
మొత్తం పోస్టులు: 339
ఇందులో ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ 32, ఇండియన్ మిలటరీ అకాడమీ, డెహ్రాడూన్ 100, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ 22, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై 169, ఎస్ఎస్సీ ఉమెన్ (నాన్ టెక్నికల్) 16 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివి డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఎస్ఎస్బీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్
అప్లికేషన్ ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజులేదు.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 7
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 4
వెబ్సైట్: http://upsconline.nic.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

