JEE MAIN | జేఈఈ మెయిన్ 2026 పరీక్ష ప్రొవిజనల్ కీ విడుదల
కీ పేపర్, రెస్పాన్స్ షీట్లను కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యూకేషన్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జనవరి 21 నుంచి 29 వరకు జరిగిన సెషన్-1 JEE MAIN 2026 పరీక్ష ప్రొవిజనల్ కీ విడుదలైంది. జేఈఈ మెయిన్ పేపర్-1 ప్రొవిజనల్ ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్ షీట్లను NTA ఇవాళ విడుదల చేసింది. దీనిపై ఈ నెల 6వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. కీ పేపర్, రెస్పాన్స్ షీట్లను కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యూకేషన్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ మెయిన్ పరీక్షకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్తో పాటు ఇతర వివరాలను ఎంటర్ చేసి ఆన్సర్ కీని చూసుకోవచ్చు.
ఈ ఆన్సర్ కీలో ఏవైనా తప్పులున్నాయని అభ్యంతరాలు లేవెనెత్తాలంటే అభ్యర్థులు ఒక్కొ ప్రశ్నకు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి నాన్ రీఫండబుల్. ఫిబ్రవరి 6 అర్థరాత్రి 12 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించిన తరువాత ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తారు. ఈ నెల 12న JEE MAIN 2026 Results ను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మందికి పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షను రాశారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

