రేపటినుంచి ‘టీజీ ఐసెట్’
తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘టీజీఐసెట్-2026’ను నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు టీజీఐసెట్ కన్వీనర్ అల్వాల రవి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రామగిరి, మే 11 : తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘టీజీఐసెట్-2026’ను నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు టీజీఐసెట్ కన్వీనర్ అల్వాల రవి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 రీజియన్స్ పరిధిలో 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 56,223 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్టు చెప్పారు. మూడు షిఫ్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు(సీబీటీ) విధానంలో జరిగే ఈ పరీక్షలకు ఎంజీయూతోపాటు పలు యూనివర్సిటీలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్లను ప్రత్యేక పరిశీలకులుగా నియమించినట్టు వెల్లడించారు. తొలిరోజు రెండు షిఫ్టులు, రెండో రోజు ఉదయం షిఫ్టులో పరీక్ష ఉంటుందన్నారు.
ప్రతి రోజూ ఉదయం 10 నుం చి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాని గంట ముందుగానే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరని వెల్లడించారు. ఉర్దూ మీడియం, దివ్యాంగ అభ్యర్థులకు తొలిరోజు మధ్యాహ్నం పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సులువుగా చేరుకునేలా హాల్‌టికెట్లపై ఆయా పరీక్ష కేంద్రాలకు సంబంధించిన రూట్‌మ్యాప్‌తో పాటు బార్కోడ్ స్కానర్ ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

