SCI Recruitment | లా క్లర్క్ కమ్ రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సెర్చ్/ అనలిటికల్ స్కిల్స్, రాత సామర్థ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఫిబ్రవరి 15 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 90
పోస్టులు : లా క్లర్క్ కమ్ రిసెర్చ్ అసోసియేట్
అర్హతలు : న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సెర్చ్/ అనలిటికల్ స్కిల్స్, రాత సామర్థ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
పరీక్ష విధానం: పార్ట్-1, 2 రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 15 వరకు
వయస్సు: 15.02.2024 నాటికి 20-32 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.80,000.
వెబ్సైట్ : https://main.sci.gov.in/recruitment