ఐజీసీఏఆర్లో స్టెనోగ్రాఫర్, యూడీసీ పోస్టులు
ఐజీసీఏఆర్| తమిళనాడులోని కల్పక్కమ్లో ఉన్న ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఆటామిక్ రిసెర్చ్ (ఐజీసీఏఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

చెన్నై: తమిళనాడులోని కల్పక్కమ్లో ఉన్న ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఆటామిక్ రిసెర్చ్ (ఐజీసీఏఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 337 పోస్టులను భర్తీ చేస్తున్నది. స్టయిపెండరీ ట్రైనీ, వర్క్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 337
ఇందులో స్టయిపెండరీ ట్రైనీ 239, టెక్నీషియన్ బీ (క్రేన్ ఆపరేటర్) 1, స్టెనోగ్రాఫర్ 4, అప్పర్ డివిజన్ క్లర్క్ 8, డ్రైవర్ 2, సెక్యూరిటీ గార్డ్ 2, వర్క్ అసిస్టెంట్ 20, క్యాంటీన్ అటెండెంట్ 15, సైంటిఫిక్ ఆఫీసర్ 4, టెక్నికల్ ఆఫీసర్ 42 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: స్టయిపెండరీ ట్రైనీలో డిప్లొమా లేదా బీఎస్సీ, సైంటిఫిక్ ఆఫీసర్ పీహెచ్డీ, టెక్నికల్ ఆఫీసర్ బీఈ లేదా బీటెక్, టెక్నికల్ ఆఫీసర్ ఎమ్మెస్సీ లేదీ బీటెక్ చేసి ఉండాలి. మిగిలినపోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష లేదా స్కిల్ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: ఆఫీసర్ పోస్టుకు రూ.200, ఎస్టీలకు రూ.200, మిగిలిన పోస్టులకు రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
వెబ్సైట్: igcar.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

