Railway Recruitment Board | రైల్వేలో 18,799 ఉద్యోగాలు.. త్వరలోనే నోటిఫికేషన్
Railway Recruitment Board | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది ప్రారంభంలో వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి భారతీయ రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
Railway Recruitment Board | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది ప్రారంభంలో వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి భారతీయ రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. అయితే ఇప్పుడు ఆ పోస్టులను భారీగా పెంచుతూ మరో ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఉన్న ఖాళీల దృష్ట్యా మొత్తంగా 18,799 ఏఎల్పీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆర్ఆర్బీ భోపాల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఈ దీనికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు అప్పటివరకు ఏమైనా సందేహాలు ఉంటే తమ అధికారిక వెబ్‌సైట్‌ను https://indianrailways.gov.in/ చూడాలని కోరింది.
అయితే ఈ పోస్టులకు ప్రకటన అనంతరం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

