NDA Recruitment | లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్, కుక్, టీఏ- సైకిల్ రిపేరర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ తదితర గ్రూప్ సి పోస్టుల భర్తీకి పుణె ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్, 12వ తరగతి, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, స్కిల్/ ప్రాక్టికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 198
పోస్టులు : లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్, కుక్, టీఏ- సైకిల్ రిపేరర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్, 12వ తరగతి, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : పోస్టులను బట్టి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, స్కిల్/ ప్రాక్టికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్
వెబ్సైట్ : ndacivrect.gov.in
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ‘ఎంప్లాయ్మెంట్ న్యూస్’లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.