న్యూఢిల్లీ: నవోదయ విద్యాలయ సమితి (NVS) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1377 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి హెడ్‌క్వార్టర్స్, రీజినల్ ఆఫీసులు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 30తో అప్లికేషన్లు ముగుస్తాయి. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
మొత్తం పోస్టులు: 1377
ఇందులో ఫీమేల్ స్టాఫ్ నర్స్-121, స్టెనోగ్రాఫర్-23, కంప్యూటర్ ఆపరేటర్-2, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్-4, మెస్ హెల్పర్-442, ల్యాబ్ అటెండెంట్-161, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-5, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్-12, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్-381, క్యాటరింగ్ సూపర్వైజర్-78, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్-128, లీగల్ అసిస్టెంట్-1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-19 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష లేదా స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టుకు రూ.1500, మిగిలిన పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500
ఈ-మెయిల్: navodaya.gov.in