జ్యోతిబాపూలే గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ అడ్మిషన్స్
డిగ్రీ అడ్మిషన్స్| మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ (MJPTBCWREIS)కి అనుబంధంగా పనిచేస్తున్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం MJPTBCWR JC, RDC-CET-2021

హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ (MJPTBCWREIS)కి అనుబంధంగా పనిచేస్తున్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం MJPTBCWR JC, RDC-CET-2021 నోటిఫికేషన్ విడుదలయ్యింది. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ కోర్సులు ఇంగ్లిష్ మీడియంలో ఉంటాయి. ఇంటర్లో IIT, NEET, EAMCET, CA / CPT అండ్ CLAT ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌కు కోచింగ్ అందిస్తున్నది. రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ ఇంటర్కాలేజీలు మొత్తం 138 ఉన్నాయి. అందులో బాలురు-68, బాలికలు-70 సంబంధించినవి.
కోర్ గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ,
ఒకేషనల్ కోర్సులు: అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, అకౌంటింగ్ అండ్ టాక్సేషన్
ఆఫీస్ అసిస్టెంట్ షిప్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, హోమ్ సైన్స్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్
అర్హత: ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు హాజరైన లేదా పాసై ఉండాలి. తెలంగాణకు చెందిన విద్యార్థులు మాత్రమే అర్హులు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ .1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 మించకూడదు.
MJPTBC రెసిడెన్షియల్ బీసీ పాఠశాలలు, బీసీ వెల్ఫేర్ హాస్టల్ బోర్డర్లు చదివిన విద్యార్థుల కోసం 25 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 75 శాతం సీట్లు ఇతర విద్యార్థులకు కేటాయించారు.
మహిళా డిగ్రీ కళాశాల
కోర్సులు: బీఎస్సీలో ఎంపీసీ, ఎంఎస్సీఎస్, ఎంపీసీఎస్, బీజెడ్సీ, బీబీసీ, డేటా సైన్స్, బీఏలోహెచ్ఈపీ, హెచ్‌పీఈ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బిజినెస్
అర్హత: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థులు
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. రాతపరీక్షలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి.
RJC CET-2021లో జిల్లా స్థాయి మెరిట్లో ఎంపీసీ, బైపీసీ, సీఎసీలో ప్రవేశాలు కల్పిస్తారు.
హెచ్ఈసీ, ఎంఈసీ, ఒకేషనల్ కోర్సుల సీట్ల కేటాయింపు రాష్ట్ర స్థాయి మెరిట్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.200
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 15
వెబ్సైట్: www.mjptbcwreis.telangana.gov.in లేదా mjptbcwreis.cgg.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

