Polytechnic Colleges | ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకే జై.. ప్రభుత్వ కాలేజీల్లో 92%.. ప్రైవేట్లో 58% సీట్ల భర్తీ
Polytechnic Colleges | డిప్లొమా కోర్సుల్లో చేరే విద్యార్థుల్లో అత్యధికులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకే జై కొడుతున్నారు. సర్కార్ కాలేజీల్లోనే అడ్మిషన్లు పొందుతున్నారు.
Polytechnic Colleges | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా కోర్సుల్లో చేరే విద్యార్థుల్లో అత్యధికులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకే జై కొడుతున్నారు. సర్కార్ కాలేజీల్లోనే అడ్మిషన్లు పొందుతున్నారు. ఈ ఏడాది పాలిసెట్ సీట్ల భర్తీలో ఇదే ట్రెండ్ కనిపించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో రికార్డుస్థాయిలో 92% సీట్లు నిండాయి. అదే ప్రైవేట్ కాలేజీల్లో 58% సీట్లు మాత్రమే నిండాయి. ప్రభుత్వ కాలేజీల్లో మంచి వసతులుండటం, ల్యాబ్లు, నిపుణులైన ఫ్యాకల్టీ ఉండటంతో ప్రైవేట్ కాలేజీలను కాదని ప్రభుత్వ కాలేజీల్లోనే చేరుతున్నారు. పాలిసెట్ మొదటి విడత సీట్లను ఆదివారం కేటాయించారు. మొత్తం 112 కాలేజీల్లో 32వేలకు పైగా సీట్లుండగా, 25వేలు సీట్లు నిండాయి. వీటిలో 16వేలకుపైగా సీట్లు ప్రభుత్వ కాలేజీల్లోనివే కావడం గమనార్హం.
బ్రాంచీలవారీగా తీసుకుంటే సీఎస్ఈలోనే అత్యధిక సీట్లు నిండాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 9లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. సోమవారం నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. ఈ నెల 8 నుంచి 12 వరకు విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు.

Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

