చక్కటి ప్రణాళికతో ‘చరిత్ర’ సృష్టిద్దాం!
పోటీ పరీక్షల్లో ప్రధానమైన విభాగం హిస్టరీ (చరిత్ర). చదువుతున్నప్పుడు చరిత్ర ఈజీగానే అర్థమవుతుంది. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను చూసి చాలామంది తికమక పడుతుంటారు. కాబట్టి హిస్టరీ సబ్జెక్టుపై ఎలా పట్టు సాధించాలో తెలుసుకుందాం..
- చరిత్రలో గ్రూప్-1 సర్వీసెస్ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ సమతౌల్యాన్ని పాటిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఏపీపీఎస్సీకి సంబంధించి ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఉంటాయి. సిలబస్ పరిగణలోకి తీసుకొంటే సాంస్కృతిక చరిత్రపై ఎక్కువగా దృష్టి సారించారు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే 1/5వ వంతు చరిత్ర పరంగా కవర్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు.
- సిలబస్ ప్రకారం ఎక్కువగా సాంస్కృతిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. ఇండియన్ హిస్టరీ నుంచి 20-25 ప్రశ్నలు ప్రిలిమినరీ పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. చరిత్రలో ఈ అంశాలు చూసుకుంటే సింధూ నాగరికత, గుప్తుల సామ్రాజ్యం, పుష్యభూతి వంశం, ఢిల్లీ సుల్తాన్లు, విజయనగర సామ్రాజ్యం, భారత్‌లో యూరోపియన్ వర్తక సంఘాలు, 1857 భారత స్వాతంత్య్ర పోరాటం, భారతదేశ పునరేకీకరణ మొదలైనవి ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఇంటిగ్రేటెడ్‌గా ప్రిపేరవడం ఉత్తమం. ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా గత ప్రశ్నపత్రాలను చూసినట్లయితే బేసిక్స్ బలంగా ఉండాలని తెలుస్తుంది. పోటీ పరీక్షల్లో ప్రీవియస్ ఇయర్ ప్రశ్నపత్రాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఏ అంశం నుంచి ప్రశ్నలు వస్తున్నాయి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? అని తెలియజేస్తాయి. సిలబస్, గత ప్రశ్నపత్రాలు ఉపయోగించుకొని సులభంగా ప్రిపేర్ అవచ్చు.
- ఇండియన్ హిస్టరీలో ప్రాచీన చరిత్రకు ఆర్ఎస్ శర్మ, మాధ్యమిక చరిత్రకు సతీష్ చంద్ర, ఆధునిక చరిత్రకు బిపిన్ చంద్ర లేదా స్పెక్ట్రమ్ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవచ్చు. బేసిక్స్ కోసం ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవాలి. ఆంధ్ర హిస్టరీ కోసం కంభంపాటి సత్యనారాయణ, బీఎస్ఎల్ హనుమంతరావు పుస్తకాలను అనుసరించాలి. తెలంగాణ హిస్టరీ కోసం అడపా సత్యనారాయణ, తెలంగాణ చరిత్ర-సంస్కృతి రాష్ట్ర అవతరణ ఉద్యమాలు అనే పుస్తకాన్ని అనుసరించాలి. వీటితో పాటు తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి. హిస్టరీ సబ్జెక్టును ఎలా చదివినా పరవాలేదు. కాబట్టి సులువుగా అర్థమవుతుంది. కానీ ఏ అంశంపై ఎంత సమయం పెట్టాలనేది తెలుసుకోవాలి.
- పరీక్షల్లో విజయం సాధించాలంటే రివిజన్ (పునశ్చరణ) చాలా అవసరం. రివిజన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు అందులోని ముఖ్యాంశాలను పాయింట్లుగా లేదా అనుకూలమైన రీతిలో (చార్ట్, గ్రాఫ్‌లు వంటివి) షార్ట్ నోట్స్ రాసుకోవాలి. చదివిన అంశాలను ఇతరులతో చర్చించడం, స్వీయ మూల్యాంకనం చేసుకోవడం మెమరీపరంగా బాగా ఉపయోగపడుతుంది. సొంత నోట్స్‌ను రూపొందించుకోవడం విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది. చదివిన ప్రతి అంశాన్ని నోట్స్‌లో పొందుపరిస్తే సమయం వృథా అవుతుంది. ఒక పుస్తకాన్ని కనీసం రెండుసార్లు చదివితేనే నోట్స్ రాయడం అలవాటు చేసుకోవాలి. ఈ నోట్స్‌లోని అంశాలు ముఖ్యమైనవి కాబట్టి ఎన్నిసార్లు చదివితే అంత మంచిది.
- ప్రస్తుత ప్రిపరేషన్ సమయంలో ముఖ్యమైన అంశాలను షార్ట్‌కట్స్‌గా రాసుకోవాలి. ఇది పరీక్ష ముందు క్విక్ రివిజన్గా ఉండేలా నోట్స్ రూపొందించుకోవాలి. అభ్యర్థులు ముందుగా ప్రిపరేషన్‌కు మానసికంగా సిద్ధమవాలి. ఒత్తిడి అనే మాటకు స్థానమివ్వకూడదు. ఉద్యోగం సాధించాలంటే గట్టి సంకల్పం, విజయం సాధించగలం అనే ఆత్మవిశ్వాసం అవసరం. అప్పుడే ఎలాంటి ఆటంకాలు ఎదురయినా వాటిని అధిగమించవచ్చు. సంకల్ప బలంతో విజయం దిశగా దూసుకెళ్లవచ్చు. అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రధానం. సమయపాలన ముఖ్యం. పేపర్లవారీగా సిలబస్‌ను విశ్లేషించుకొని రోజూ అన్ని సబ్జెక్టులు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. అప్పుడే అన్ని అంశాల మధ్య సమతౌల్యం సాధ్యమవడంతో పాటు అనుసంధానం చేసుకోవచ్చు.
- సిలబస్‌లోని అంశాలను నేరుగా బిట్స్ రూపంలో చదవడం కాకుండా ముందు అంశాన్ని చదివి టెస్టులు రాయడం మంచిది. వీలైనంత వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏది పరీక్షకు అవసరం ఏది కాదు అని అవగాహన తెచ్చుకోవాలి. ప్రణాళిక వేసుకోవడం ఎంత ముఖ్యమో ప్రణాళికను అమలు చేయడం కూడా అంతే ముఖ్యం. రోజువారీ లక్ష్యాలను దినచర్య రూపంలో రాసుకొని అనుసరించడం ఉత్తమం. రోజు పునశ్చరణ చేసుకోవడం చదివిన వాటిని పడుకునేముందు గుర్తుకు తెచ్చుకోవడం/ నెమరువేసుకోవడం వల్ల బాగా గుర్తుంటాయి.
సమయపాలన ముఖ్యం
- పరీక్ష సయమంలో సమయ పాలన ఎంత ముఖ్యమో ప్రిపరేషన్ సమయంలో కూడా అంతే ముఖ్యం. చదువుకునే సమయంలో విరామాలు ఇవ్వడం, సరిగా నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం కూడా పరిగణలోకి తీసుకోవాలి. చదివేదానిపై ఆసక్తి పెంచుకోవడం మంచిది. ఒక సబ్జెక్ట్ ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎంత సమయం పడుతుందని అంచనా వేసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌తో అప్డేట్ చేసుకోవాలి. సరైన ప్రణాళిక పాటిస్తూ, సమయ పాలన చేసుకుంటూ షార్ట్‌నోట్స్ రాసుకుంటూ రివిజన్‌కు సమయం కేటాయిస్తూ పరీక్ష విధానాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళితే విజయం సాధించవచ్చు.
- చరిత్రలో ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక భారతదేశ చరిత్ర ఉంటుంది. ఈ మూడింట్లో ఆధునిక భారతదేశ చరిత్రకు అధిక వెయిటేజీ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ సాగించాలి. చరిత్ర అధ్యయనం అనేది అవగాహన, విశ్లేషణపై ఆధారపడి ఉంటుంది. టైమ్‌లైన్ ఆధారంగా చరిత్ర అధ్యయనం సాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకు ప్రిలిమ్స్ కోణంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం 1885 అని చదివితే సరిపోదు. దీని స్థాపనకు దారి తీసిన పరిస్థితులు, క్రీయాశీలంగా వ్యవహరించిన వ్యక్తులు వంటి విషయాలను తప్పనిసరిగా చదవాలి. ఇలా చేయడం వల్ల మెయిన్స్‌కు సన్నద్ధత లభిస్తుంది. చరిత్రలో మెయిన్స్‌కు సంబంధించి విస్తృతంగా విశ్లేషణ చేయాలి. ఉదాహరణకు మెయిన్స్‌లో భరతనాట్యం, కూచిపూడి మధ్య వ్యత్యాసాలను సోదాహరణంగా వివరించండి? అని అడిగితే రెండు కళలను పోల్చుతూ విశ్లేషిస్తూ సమాధానం రాయాలి. ప్రిలిమ్స్‌కు సంబంధించి స్వాతంత్య్ర ఉద్యమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
- పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ కారణంగా సమాధానం కచ్చితంగా తెలిస్తే మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. అధిక పోటీ కారణంగా పరీక్షలో ప్రతి ఒక్క మార్కు ముఖ్యం. కాబట్టి గుడ్డిగా ఊహించడం మానుకోవాలి. గ్రూప్-1 ప్రిలిమ్స్ సిలబస్ చాలా విస్తృతమైనది, సమగ్రమైనది. ఇది ప్రాచీన భారతీయ చరిత్ర నుంచి ఆధునిక కాలపు శాస్త్రీయ పరిణామాల వరకు దాదాపు అన్ని విషయాలను కలిగి ఉంటుంది. అందువల్ల పరీక్షలో విజయం సాధించడానికి మరిన్ని సబ్జెక్టులపై అవగాహన ఉండాలి.
- భారతదేశ చరిత్ర కోసం సిద్ధమవుతున్నప్పుడు చరిత్రలో రాజకీయ, ఆర్థిక, సామాజిక, కళ, సాహిత్యం, సాంస్కృతిక, నిర్మాణ అంశాలపై దృష్టి పెట్టాలి. చరిత్రపై పాత ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు భారతీయ చరిత్రకు సరిపోతాయి. అయితే కొత్త ఎన్సీఈఆర్టీ చరిత్ర పుస్తకాలను కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. కొత్త ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ప్రపంచ చరిత్ర భాగం సిలబస్‌లో లేనందున వాటిని దాటవేయవచ్చు. తప్పనిసరిగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ముఖ్యమైన అంశాలను చదవాలి.
l మునుపటి పేపర్లను ప్రాక్టీస్ చేయడం అనేది ప్రిపరేషన్ ప్రక్రియలో ముఖ్యమైన దశ. అనేక సార్లు మునుపటి సంవత్సరాల ప్రశ్నపత్రాల నుంచి నేరుగా ప్రశ్నలు పరీక్షల్లో అడిగారు. అంతేకాకుండా వాటిని సాధన చేయడం వల్ల పరీక్షలో ఒక అంశం గురించి ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. - ముఖ్యంగా సిలబస్, పరీక్ష విధానంపై ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
- కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి.
- ప్రతి పేపర్‌కు సమయం కేటాయించాలి.
- పూర్తి సిలబస్ సమీక్ష చేసుకోవాలి.
- క్వశ్చన్ బ్యాంక్ కలిగి ఉన్న ఉత్తమ పుస్తకాలు, అధ్యయన సామగ్రిని ఎంచుకోవాలి.
- ఒక సబ్జెక్ట్ కోసం ఒక పుస్తకాన్ని ఎంచుకోవాలి.
- రోజువారీ పునశ్చరణ చేయాలి.
- సిలబస్‌లోని క్లిష్టమైన ప్రాంతాలను గుర్తించాలి.
- కష్టమైన, సులభమైన అంశాలను గుర్తించాలి.
- ప్రతిరోజూ వార్తాపత్రికలను చదవాలి.
- ప్రతిరోజూ మాక్‌టెస్టులు రాయాలి.
- కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ కోసం మ్యాగజీన్స్, జర్నల్స్ చదవాలి.
- రోజువారీ పరీక్షల ద్వారా సమయ, వేగ నిర్వహణ నేర్చుకోవాలి.
- పోటీ ఎక్కువగా ఉన్నందున సాధన భిన్నంగా, సమర్థవంతంగా ఉంటే మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించవచ్చు. ఉన్నతమైన వ్యూహాన్ని అనుసరించడం ద్వారా పోటీ పరీక్షలో చరిత్రను సృష్టించవచ్చు.
పెద్దిరాజు శివచరణ్ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ
అశోక్ నగర్, హైదరాబాద్9133237733
పుస్తక సమీక్ష
జీకే & జీఎస్-2022
పోటీపరీక్షల్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ చాలా కీలకమైనవి. సముద్రం లాంటి సిలబస్‌లో పోటీపరీక్షలకు ఏది అవసరం? గతంలో, ప్రస్తుతం ఏం ఇస్తున్నారు? అనే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి జీకే&జీఎస్ బుక్‌ను పుస్తక రచయిత, పోటీపరీక్షల శిక్షణలో విశేష అనుభవం ఉన్న బి. కృష్ణారెడ్డి రూపొందించారు. దీంతో పాటు అన్ని పోటీపరీక్షలకు సంబంధించి ‘పర్యావరణం& విపత్తు నిర్వహణ’ బుక్ కూడా విడుదలైంది. దీని రచయిత డా. కేయూఎం రెడ్డి. ఫ్లో చార్ట్స్, బాక్స్ ఐటమ్స్, టేబుల్స్ ద్వారా విశ్లేషణాత్మకంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఏపీలో నిర్వహిస్తున్న ఎండోమెంట్ పరీక్షల కోసం ‘హిందూ ధర్మతత్వం, దేవాలయ వ్యవస్థ’ పుస్తకాన్ని కూడా జీబీకే పబ్లికేషన్ విడుదల చేసింది. పుస్తకాలు అన్ని ప్రముఖ బుక్ సెంటర్లలో లభిస్తాయి. పూర్తి వివరాల కోసం జీబీకే పబ్లికేషన్స్, రెండో అంతస్తు, పార్క్ప్లాజా, ఆంధ్రాబ్యాంక్ ఎదురుగా, గోల్కొండ క్రాస్ రోడ్, హైదరాబాద్. సెల్: 9959361278ను సంప్రదించవచ్చు.
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో
బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో కింది పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సులు: ఎంఏ, ఎల్ఎల్ఎం
విభాగాలు: ఎంఏ (డెవలప్మెంట్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, పబ్లిక్ పాలసీ & గవర్నెన్స్),
- ఎల్ఎల్ఎం (లా&డెవలప్మెంట్)
- అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 28
వెబ్సైట్:https://azimpremjiuniversity.edu.in/postgraduate
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

