న్యూఢిల్లీ: స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 16న ప్రారంభమవుతుంది. 28వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 220 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. రాతపరీక్ష 100 మార్కులకు, ఇంటర్వ్యూ మరో 100 మార్కులకు ఉంటుంది.
మొత్తం పోస్టులు: 220
అర్హతలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, టెక్స్టైల్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్, సీఏ, సీడబ్ల్యూఏ, డిగ్రీలో ఐటీ చేసి ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్కులవ్వాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175
దరఖాస్తుల ప్రారంభం: ఫిబ్రవరి 16
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 28
వెబ్సైట్: https://indianbank.in