షేర్షా కలింజర్ కోటను ఆక్రమించిన సంవత్సరం?
`
1. పర్షియా రాజు సహాయంతో కాబూల్, కాందహార్లను గెలవడానికి హుమాయూన్ ఎవరితో యుద్ధం చేయవలసి వచ్చింది?
1) హిందాల్ 2) అస్కారి
3) కమ్రాన్ 4) షేర్షా
2. అనేక యుద్ధాల తర్వాత హుమాయూన్ 1553లో కమ్రాన్ పై గెలిచిన తర్వాత కమ్రాన్‌కు విధించిన శిక్ష?
1) మరణ శిక్ష
2) యావజ్జీవ కారాగార శిక్ష
3) దయతలచి వదిలివేశాడు
4) అంధుణ్ని చేసి మక్కాకు పంపాడు
3. 1553 నాటికి అఫ్గానిస్థాన్‌ను గెలిచిన తర్వాత హుమాయూన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతి ఎవరు?
1) భైరాన్ ఖాన్ 2) మెహిదీ ఖ్వాజా
3) మీర్జాహైదర్ 4) టార్డీబేగ్
4. సికందర్ సూర్‌ను ఓడించిన తర్వాత ఏ రోజున హుమాయూన్ ఢిల్లీ చేరాడు?
1) 1555, జూలై 23
2) 1555, జూన్ 23
3) 1555, మే 23
4) 1555, ఆగస్ట్ 23
5. సొంత గ్రంథాలయం మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తు హుమాయూన్ 1556, జనవరి 24న జారిపడ్డాడు. ఆ గ్రంథాలయం ఉన్న భవనం పేరు?
1) విన్పనా లేదా షేర్ మండల్
2) దివాన్-ఇ-ఆం
3) దివాన్-ఇ-ఖాస్ 4) రంగ్‌మహల్
6. ‘చివరికి మరణం కూడా అతని వ్యక్తిత్వానికి ఒక మచ్చుతునక. పడిపోయే అవకాశం ఎక్కడున్నా హుమాయూన్ దాన్ని వదులుకోడు. అతని జీవితమంతా దొర్లి పడటమే. చివరికి అందులోనుంచే దొర్లి బయట పడ్డాడు.’ అని హుమాయూన్ గురించి వ్యాఖ్యానించిన చరిత్రకారుడు?
1) వి.ఎ.స్మిత్ 2) జేమ్స్‌మిల్
3) లేన్పూల్ 4) నిజాముద్దీన్
7. షేర్షా అసలు పేరు?
1) నాజిరుద్దీన్ 2) జహీరుద్దీన్
3) ఫరీద్ 4) మారుద్దీన్
8. హోషియాపూర్ జిల్లాలోని బజ్వారాలో ఏ సంవత్సరంలో షేర్షా జన్మించినట్లుగా కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం?
1) 1470 2) 1471
3) 1472 4) 1473
9. షేర్షా తండ్రి హసన్ ఎవరి వద్ద పనిచేశాడు?
1) జమాల్‌ఖాన్ 2) జలాల్ఖాన్
3) బాబర్ 4) జహీర్‌ఖాన్ లోహనీ
10. షేర్షా తండ్రి అయిన హసన్‌కు జావస్పూర్, హాజిపూర్ తండాలతోపాటు లభించిన జాగీరు?
1) ససారాం 2) జాన్పూర్
3) హిస్సార్ 4) కలింజర్
11. షేర్షా ఫరీద్‌గా ఉన్నప్పుడు?
1) చదువబ్బలేదు
2) కేవలం అరబ్బీ మాత్రమే వచ్చేది
3) అరబిక్, పర్షియన్ భాషల్లో పండితుడు
4) కేవలం పర్షియన్ భాష మాత్రమే వచ్చేది
12. ఫరీద్ (తర్వాత షేర్‌ఖాన్ లేదా షేర్షా) ఏ కారణంతో తన జాగీర్ వదులుకొని ఆగ్రా పోవలసి వచ్చింది?
1) జాగీర్ను శత్రువులు ఆక్రమించుకున్నారు
2) సవతి తల్లి తప్పుడు మాటలతో తండ్రి వెళ్లగొట్టాడు
3) ఆగ్రాలో మంచి ఉద్యోగం లభించడంతో
4) జాగీర్ను పాలించడంలో ఆసక్తి లేదు
13. కానుంగో అభిప్రాయం ప్రకారం షేర్షా ఏ సంవత్సరంలో జన్మించాడు?
1) 1483 2) 1484
3) 1485 4) 1486
14. షేర్‌ఖాన్ 1523లో జరిగిన గోగ్రా యుద్ధంలో ఎవరికి సహాయం చేశాడు
1) రాణా సంగా 2) బాబర్
3) మహ్మద్ లోడి 4) ఇబ్రహీం లోడి
15. చునార్ రాజ్యాన్ని షేర్‌ఖాన్ ఏ విధంగా సంపాదించాడు?
1) వితంతువైన చునార్రాణి లాడ్ మాలికను వివాహం చేసుకోవడం ద్వారా
2) హుమాయూన్ను ఓడించడం ద్వారా
3) చునార్ రాజు తాజ్ఖాన్ను ఓడించి చంపడం ద్వారా
4) బెంగాల్ రాజు నస్రత్షాను ఓడించడం ద్వారా
16. 1532లో ప్రఖ్యాతి చెందిన బెంగాల్ గవర్నర్ ఎవరు?
1) షేర్‌ఖాన్ 2) నస్రత్ షా
3) జలాల్ఖాన్
4) షియాఉద్దీన్ మహ్మద్‌షా
17. షేర్‌ఖాన్ బెంగాల్ సైన్యాన్ని లోహనీ సర్దారులను 1534లో ఏ యుద్ధంలో ఓడించాడు
1) చునార్ 2) చౌసా
3) థౌరియా 4) సైరజ్ఘర్
18. షేర్‌ఖాన్‌తో యుద్ధాల సందర్భంగా బెంగాల్ నవాబైన మహ్మద్షాకు సహాయం చేసిన యూరోపియన్లు?
1) పోర్చుగీస్ 2) డచ్
3) ఇంగ్లిష్ 4) ఫ్రెంచ్
19. 1538 మార్చిలో షేర్షా ఏ కోటను జయించి, ఆ కోటను ఆక్రమించిన మొదటి ముస్లిం రాజు అయ్యాడు ?
1) రోహటాస్ 2) గౌర్
3) చునార్ 4) ఆగ్రా
20. షేర్షా సేనలు లాహోర్‌ను ఆక్రమించిన కాలం?
1) నవంబర్ 1541 2) నవంబర్ 1540
3) నవంబర్ 1539 4) నవంబర్ 1538
21. దాదాపు 68 సంవత్సరాల వయస్సులో చక్రవర్తి అయిన ఏ రాజు తన గురించి ‘నా జీవిత సాయంకాలంలో భగవంతుడు కరుణించి నాకు ఈ సామ్రాజ్యాన్నిచ్చాడు’ అని అన్నాడు?
1) షేర్షా 2) హుమాయూన్
3) బహదూర్ షా 4) ఔరంగజేబు
22. షేర్షా చక్రవర్తి అయిన తర్వాత తిరుగుబాటు చేసిన బెంగాల్ గవర్నర్?
1) ఖిజీర్‌ఖాన్ 2) నస్రత్ ఖాన్
3) మహ్మద్‌షా 4) బహదూర్షా
23. బెంగాల్ తిరుగుబాటును అణచివేసిన తర్వాత షేర్షా చేసిన ముఖ్యమైన పని?
1) బెంగాల్ స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయడం
2) బెంగాల్ గవర్నర్‌గా ఖిజిర్ఖాన్ను నియమించాడు
3) బెంగాల్ గవర్నర్ పదవిని రద్దు చేసి బెంగాల్‌ను 47 సర్కారులుగా విభజించాడు
4) బెంగాల్ రాష్ర్టాన్ని విభజించకుండా ఏర్పాటు చేశాడు
24. 1542లో షేర్షా ఆక్రమించిన కోట?
1) ఆగ్రా 2) గ్వాలియర్
3) కలింజర్ 4) ఉజ్జయిని
25. షేర్షాతో యుద్ధం చేయకుండా లొంగిపోయి అఖండ స్వాగతం ఏర్పాటు చేసిన ఉజ్జయిని పాలకుడు?
1) మహ్మద్‌షా 2) బహదూర్షా
3) నస్రత్షా
4) ఖాదిర్షా బిరుదుగల మల్లుఖాన్
26. 1543లో షేర్షా రైసన్ కోట ఆక్రమించుకున్న దశలో అక్కడ ఉన్న రాజపుత్రులందరినీ హతమార్చినపుడు ఆ కోట పాలకుడు?
1) రాయ్ పురాన మల్ చౌహాన్
2) రాణా సంగా
3) మల్దేవ్ రాథోడ్
4) రాణా ఉదయ్‌సింగ్
27. షేర్షా కాలంలో కలింజర్ కోట పాలకుడు?
1) రాణా ఉదయ్‌సింగ్
2) రాయ్పురాన మల్ చౌహాన్
3) రాజా కిరత సింగ్
3) మల్దేవ్ రాథోడ్
28. కలింజర్ కోటను షేర్షా ఆక్రమించిన సంవత్సరం?
1) 1543 2) 1544
3) 1545 4) 1546
29. షేర్షా చనిపోవడానికి కారణం?
1) ద్రోహం కారణంగా యుద్ధంలో చంపివేత
2) వృద్ధాప్యంతో చనిపోయాడు
3) గ్రంథాలయం మెట్లు దిగుతూ జారిపడి చనిపోయాడు
4) కలింజర్ కోట ఆక్రమణ సందర్భంగా ప్రమాదవశాత్తు మందుగుండు సామగ్రిపేలి మరణించాడు
30. షేర్షా తర్వాత ఢిల్లీ పాలకుడు?
1) ఇబ్రహీంఖాన్ 2) ఇస్లాం షా
3) ఫిరోజ్‌షా 4) సికిందర్షా
31. షేర్షా కాలంలో వజీర్ ఆధీనంలో గల దివాన్-ఇ-విజారత్ నిర్వహించే శాఖ?
1) ఆర్థిక, విత్త సంబంధ 2) న్యాయ
3) రక్షణ 4) మత సంబంధ
32. రక్షణ శాఖగా పేరుపడిన దివాన్-ఇ-ఆరిజ్ అధిపతి?
1) మీర్ భక్షి
2) ఆరిజ్ -ఇ-మమలిక్
3) సదర్-ఉస్-సుదుర్ 4) ఖాజీ
33. షేర్షా కాలంలో దివాన్- ఇ-రసాలత్ లేదా దివాన్-ఇ-మహతాసిబ్’ శాఖ నిర్వహించే విధులు?
1) ఆదాయ వ్యవహారాలు
2) మతసంబంధ విషయాలు
3) విదేశీ వ్యవహారాలు
4) రక్షణ విషయాలు
34. షేర్షా కాలంలో దివాన్ -ఇ- ఇన్హా శాఖ నిర్వహించే విధులు
1) రాజు ఇ ఉత్తర్వులు తయారు చేయడం స్థానిక అధికారులకు పంపడం
2) సైనికులను నియమించడం
3) స్థానిక రెవెన్యూ విధానాలను పర్యవేక్షించడం
4) అంతఃపుర పర్యవేక్షణ
35. షేర్షా కాలంలో దివాన్ ఇ-బరీచ్ నిర్వహించే శాఖ?
1) అంతఃపుర పర్యవేక్షణ
2) గూఢచర్యం
3) రక్షణ
4) విదేశీ వ్యవహారాలు
36. షేర్షా కాలంలో ‘దివాన్-ఇ-బరీద్’ శాఖాధిపతి?
1) బరీద్-ఇ-మమలిక్
2) మీర్బక్షీ
3) వజీర్ 4) ఖాజీ
37. షేర్షా కాలంలో న్యాయశాఖ పేరు?
1) దివాన్-ఇ-బరీద్
2) దివాన్-ఇ-ఇన్హా
3) దివాన్-ఇ-విజరత్
4) దివాన్-ఇ-ఖాజా
38. షేర్షా కాలంలో అంతఃపుర పర్యవేక్షణ చేసే శాఖ పేరు?
1) దివాన్ -ఇ- బరీద్
2) దివాన్-ఇ-ఇన్హా
3) దివాన్ -ఇ- విజరత్
4) దివాన్ -ఇ- మహతాసిబ్
39. షేర్షా బెంగాల్‌ను ఎన్ని సర్కార్లుగా విభజించాడు?
1) 40 2) 47 3) 52 4) 57
40. షేర్షా కాలంలో సర్కారుకు అధిపతి ఎవరు?
1) సుబేదార్ 2) షిక్దార్
3) మున్సిఫ్
4) షిక్దార్-ఇ-షిక్దారన్
41. షిక్దార్ -ఇ-షిక్దారన్ ముఖ్య విధులేవి?
1) పౌరపాలన చూడటం
2) శాంతిభద్రతలు కొనసాగించడం
3) షిక్దార్లపై పర్యవేక్షణ 4) పైవన్నీ
42. సర్కారులో రెవెన్యూ వసూలును నిర్వహించే అధికారి?
1) షిక్దార్ 3) షిక్దార్-ఇ-షిక్దారన్
3) మున్సిఫ్ 4) దివాన్
43. కింది వాటిలో సరైనవి ఏవి?
1) షిక్దార్-ఇ-షిక్దారన్ పౌరన్యాయం, నేర న్యాయం పర్యవేక్షిస్తాడు
2) మున్సిఫ్-ఇ-మున్సిఫన్ పౌరన్యాయం, నేర న్యాయం పర్యవేక్షిస్తాడు
3) షిక్దార్-ఇ-సిక్దారన్ నేర న్యాయాన్ని మున్సిఫ్-ఇ-మున్సిఫన్ పౌరన్యాయాన్ని నిర్వహిస్తారు
4) షిక్దార్-ఇ-షిక్దారన్ పౌరన్యాయాన్ని, మున్సిఫ్-ఇ-మున్సిఫన్ నేరన్యాయాన్ని నిర్వహిస్తారు
44. షేర్షా సర్కారులను కింది విధంగా విభజించాడు?
1) పరగణాలు 2) సుబా
3) ఇక్తా 4) జాగీర్
45. పరగణాల అధిపతిగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలు చూడవలసిన అధికారి?
1) షిక్దార్ 2) మున్సిఫ్
3) షిక్దార్-ఇ-షిక్దారన్ 4) అమీన్
46. పరగణాల భూమి శిస్తు వ్యవహారాలను చూసే అధికారి?
1) మున్సిఫ్ లేదా అమీన్
2) కార్కూన్
3) ఒక భవనం పేరు
4) షేర్షా కట్టిన కోటపేరు
47. షేర్షా కాలంలోని సికందరీ గజ్ అనేది?
1) రెవెన్యూ శాఖ
2) భూమిని కొలవడానికి ఉపయోగించిన కొలత
3) ఒక భవనం పేరు
4) షేర్షా కట్టిన కోటపేరు
48. షేర్షా కాలంలో భూమిశిస్తు?
1) పంటలో సగ భాగం
2) పంటలో 1/4 వంతు
3) పంటలో 1/3 వంతు
4) పంటలో 1/5 వంతు
49. షేర్షాకాలంలో భూమిని ఏ విధంగా విభజించాడు?
1) ఉత్తమ, మధ్యమ, అథమ
2) చిచర్, బంజర్, పరౌటీ
3) పోలజ్, పరౌటీ, బంజర్
4) పోలజ్, ఉత్తమ, మధ్యమ
50. షేర్షా ఎన్ని సరాయ్‌లు నిర్మించాడు?
1) 1500 2) 1600
3) 1700 4) 1800

– తెలుగు అకాడమీ సౌజన్యంతో
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

