రక్తం గడ్డ కట్టడానికి పట్టే సమయం?
రక్త ప్రసరణ వ్యవస్థ
రక్త ప్రసరణ వ్యవస్థ నిమ్నశ్రేణికి చెందిన జీవుల్లో ఒకటే కణం ఉండటం వల్ల వివిధ పదార్థాల రవాణా సులభంగా జరుగుతుంది.
ఉదాహరణ: అమీబా వంటి జీవుల్లో జీవపదార్థమే రక్తం ప్రసరించి అన్ని భాగాలకు వివిధ పదార్థాలను రవాణా చేస్తుంది. దీనినే ‘వ్యాపనం’ అంటారు.
వ్యాపన పద్ధతిలో మానవుల్లో రవాణా జరగాలి. అంటే 2 మీటర్ల దూరానికి 60 సంవత్సరాల కాలం పడుతుంది.
రవాణాను వేగవంతం చేయడానికి రక్తప్రసరణ వ్యవస్థ ఏర్పడింది. మానవుని రక్తప్రసరణ వ్యవస్థలో మూడు భాగాలు కలవు.
1. రక్తం 2. రక్తనాళాలు
3. హృదయం
ఆరోగ్యవంతమైన వ్యక్తిలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తం అధ్యయనాన్ని ‘హిమటాలజీ’ అంటారు.
రక్తం ఒక ద్రవరూప కణజాలం, ఒక సంధాయక కణం.
రక్తం సాధారణంగా క్షారస్థితిలో ఉంటుంది.
దీని P.H విలువ (7.4) 7 కంటే ఎక్కువ.
రక్తంలో 2 భాగాలుంటాయి.
ప్లాస్మా, రక్తకణాలు
ప్లాస్మా: రక్తం గడ్డకట్టకముందు గడ్డకట్టించే ద్రవపదార్థాన్ని ప్లాస్మా అంటారు. ఇది లేత పసుపు రంగులో ఉంటుంది. ప్లాస్మాలో 90 శాతం నీరు ఉంటుంది. ప్లాస్మా రక్తంలో 60 శాతం ఉంటుంది. ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఆల్బిమిన్లు, గ్లోబ్యులిన్స్ అనే ప్రొటీన్లు ఉంటాయి.
రక్తం గడ్డకట్టకుండా రక్తనాళాల్లో తోడ్పడే, ఉపయోగపడే పదార్థం ‘హిపారిన్’.
రక్తం గడ్డకట్టిన తర్వాత తేలియాడే ద్రవపదార్థం ‘సీరం’.
సీరం కూడా లేత పసుపు రంగులో ఉంటుంది. దీనిలో ఎలాంటి ప్రొటీన్స్ ఉండవు. ప్రతిరక్షకాలు కూడా ఉండవు.
రక్తకణాలు: రక్తం గడ్డ కట్టిన తరువాత అడుగు భాగాన గల ఘన పదార్థాన్ని రక్తకణాలు అంటారు.
ఎర్ర రక్తకణాలు: వీటినే ఎరిత్రోసైట్లు అంటారు. ఎర్రరక్త కణాలు ద్విపుటాకారంగా ఉంటాయి.
ఎర్రరక్త కణాల్లోని కేంద్రకం క్షీరదాల్లో సాధారణంగా ఉండదు. కానీ ఒంటె, లామా అనే రెండు క్షీరదాల్లో ఎర్రరక్తకణాల్లో కేంద్రకం ఉంటుంది.
ఎర్ర రక్తకణాల ఉత్పత్తి ఎముక మజ్జ లేదా అస్థిమజ్జలో జరుగుతుంది. ఎర్ర రక్తకణాలు 120 రోజులు జీవిస్తాయి.
ఎర్ర రక్తకణాలు ఒక క్యూబిక్ మి.లీ. రక్తంలో 4.5-5×106
ఎర్ర రక్తకణాలు చనిపోయే భాగం ప్లీహం. దీనినే ఎర్ర రక్తకణాల స్మశానవాటిక/Burial Ground of the RBC అంటారు.
ఎర్ర రక్తకణాలు ఒక రోజులో చనిపోయేవి, జన్మించేవి 10×1012
ఎర్ర రక్తకణాలు చిన్నపిల్లల్లో శిశువు దశలో కాలేయం నుంచి, పిత్తాశయం నుంచి జన్మిస్తాయి.
ఎర్ర రక్తకణాలు ఎరుపురంగులో ఉండటానికి కారణం హిమోగ్లోబిన్. రక్తంలో అతిపెద్ద ప్రొటీన్ హిమోగ్లోబిన్ మూలకం Fe (ఐరన్).
సాధారణంగా హిమోగ్లోబిన్ స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ.
హిమోగ్లోబిన్ శాతం 4mgకు తగ్గిపోతే కలిగే జన్యుసంబంధ వ్యాధి ‘తలసేమియా’ అంటారు. ఈ వ్యాధిలో ఆల్ఫా, బీటా అనే రెండు రకాలు కలవు.
హిమోగ్లోబిన్ ప్రొటీన్‌లో వివిధ భాగాల్లో వచ్చే లోపాల వల్ల ఈ రెండు రకాల తలసేమియా వ్యాధులు కలుగుతాయి.
ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గిపోతే కలిగే వ్యాధి ‘ఎనీమియా’.
ఎర్ర రక్తకణాలు వాయువును రవాణా చేస్తాయి. ప్రతిజనకాలను కలిగి ఉంటాయి.
తెల్లరక్త కణాలు (ల్యూకోసైట్లు): ఇవి అమీబా ఆకృతిలో ఉంటాయి. 12-13 రోజులు జీవిస్తాయి.
కేంద్రకం ఉంటుంది. తెలుపు రంగులో ఉంటాయి. ఇవి ‘లింఫ్’ ద్రవంలో జన్మిస్తాయి.
శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులతో తెల్లరక్త కణాలు పోరాటం చేస్తాయి.
వ్యాధులను అరికడతాయి. కాబట్టి వీటిని శరీరానికి రక్షక భటులు అంటారు.
గ్రాన్యులోసైట్లు: జీవ పదార్థంలో చిన్న చిన్న రేణువులు ఉంటాయి. వీటినే కణికాభ సహిత తెల్లరక్త కణాలు అంటారు. ఇవి 3 రకాలు.
1. ఇసినోఫిల్ 2. బేసోఫిల్స్
3. న్యూట్రోఫిల్స్
ఆమ్లవర్ణకాలను సంతరించుకునేవి తెల్లరక్త కణాలు.
ఇసినోఫిల్
ఆమ్లవర్ణకాలను సంతరించుకునే తెల్లరక్తకణాలు.
ఇవి ఎలర్జీకి ప్రతి చర్యలు చూపుతాయి.
విషపదార్థాలను విషరహితం చేస్తాయి. ఇది 2 తమ్మెల కేంద్రకాన్ని కలిగి ఉంటాయి.
బేసోఫిల్స్
కేంద్రకం ‘ S’ ఆకృతిలో ఉండి మూడు తమ్మెలు ఉంటాయి.
క్షార వర్ణకాలను సంతరించుకునేవి తెల్లరక్త కణాలు. ఇవి గాయాలు మానడానికి తోడ్పడతాయి.
ఇవి తక్కువ సంఖ్యలో గల తెల్లరక్త కణాలు.
న్యూట్రోఫిల్స్
ఇది తటస్థ వర్ణకాలను సంతరించుకొంటాయి.
5 లేదా 6 తమ్మెల కేంద్రకం ఉంటుంది.
ఇది మొదటి వరుస రక్షక భటులు. వీటినే ‘సూక్ష్మ రక్షక భటులు’ అంటారు.
ఎగ్రాన్యులోసైట్స్
జీవ పదార్థంలో ఎలాంటి రేణువులు ఉండవు. ఇవి 2 రకాలు. మోనోసైట్లు, లింఫోసైట్లు.
మోనోసైట్లు
ఇవి పెద్దవిగా గల తెల్లరక్తకణాలు. కేంద్రకం మూత్రపిండ ఆకారంలో ఉంటుంది.
ఇవి రక్తంలో మృత కణాలను తొలగిస్తాయి.
ఇవి రక్తంలో ‘పారిశుధ్య కార్మికులు’ (Scavengers of the blood).
లింఫోసైట్లు
ఇవి చిన్నగా గల తెల్లరక్త కణాలు. ఇవి బ్యాక్టీరియా, వైరస్, ఫంజి వంటి సూక్ష్మజీవులకు ప్రతిచర్యను చూపుతాయి. ఇవి ఎయిడ్స్ వ్యాధిలో నశించిపోయే తెల్లరక్తకణాలు. ఇవి ప్రతిదేహాలను (Antibodies) ఉత్పత్తి చేస్తాయి.
రక్తఫలకికలు (త్రాంబోసైట్లు): ఇది ద్వికుంభాకారంగా ఉంటాయి.
కేంద్రకం ఉండదు. వీటినే త్రాంబోసైట్లు అంటారు. ప్లేట్లెట్స్ అంటారు.
రక్తఫలకికలు తెలుపు రంగులో ఉంటాయి. 3-10 రోజులు జీవిస్తాయి.
ఇవి రక్తం గడ్డకట్టించడానికి ఉపయోగపడతాయి.
రక్తం గడ్డకట్టేటప్పుడు అవి ‘త్రాంబోకైనేజ్’ అనే ఎంజైమ్‌ను విడుదల చేస్తే ఇది ప్రోత్రాంబిన్ త్రాంబిన్‌గా మారుస్తుంది.
త్రాంబిన్ ఫైబ్రినోజన్ను ఫైబ్రిన్గా మారుస్తుంది.
ఈ ఫైబ్రిన్ గాయాలైన ప్రాంతాలకు చేరి రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతుంది.
రక్తం గడ్డకట్టటానికి తోడ్పడే విటమిన్ -కె
రక్తం గడ్డకట్టటానికి తోడ్పడే మూలకం- కాల్షియం. (Ca)
ప్రొటీన్ – ఫైబ్రిన్
రక్తకణాలు- త్రాంబోసైట్లు/రక్తఫలకికలు
సాధారణంగా రక్తం గడ్డకట్టడానికి 3-6 నిమిషాల సమయం పడుతుంది.
కొంతమంది వ్యక్తుల్లో జన్యులోపం వల్ల రక్తం గడ్డకట్టే సామర్థ్యం కోల్పోయి రక్తస్రావం జరుగుతుంది. ఈ రకమైన జన్యుసంబంధ వ్యాధిని ‘హిమోఫీలియా’ అంటారు.
హిమోఫీలియా వ్యాధిని ఇంగ్లండ్ రాణిలో మొదటగా గుర్తించారు. దీనిని రాయల్ డిసీజ్ అంటారు.
రక్తం గడ్డకట్టే వరుస క్రమం
ప్రోత్రాంబిన్: త్రాంబిన్-ఫైబ్రినోజన్- ఫైబ్రిన్
1. గుండె గదులకు రక్తాన్ని సరఫరా చేసేవి?
1) కరోనరి సిర 2) కరోనరి ధమని
3) పుపుస సిర 4) పుపుస ధమని
2. గుండెను అఘాతాల నుంచి కాపాడేది?
1) పుపుస ద్రవం
2) మస్తిష్క మేరుద్రవం
3) హృదయావరణ ద్రవం
4) సిలోమర్ ద్రవం
3. సిరల్లో కవాటాలను గుర్తించినది?
1) విలియం హార్వే 2) లెవోయిజర్
3) గైరైలమా ఫాబ్రిసి 4) పుపుససిర
4. కింది వాటిలో వేటి ద్వారా ఆమ్లజని రహిత రక్తం ప్రవహిస్తుంది?
1) కరోటిడ్ ధమని 2) బృహద్దమని
3) పుపుస ధమని 4) పుపుస సిర
5. గుండెలో పెద్ద గదులు?
1) ఎడమ కర్ణిక 2) ఎడమ జఠరిక
3) కుడి కర్ణిక, కుడి జఠరిక
4) ఏదీకాదు
6. కింది వాటిలో ఏ ధమని ద్వారా మలినరక్తం ప్రవహిస్తుంది?
1) కరోటిడ్ ధమని
2) ఎడమదైహిక మహాధమని
3) పుపుసధమని
4) 1 , 2
7. లబ్ శబ్దం రావడానికి కారణం?
1) త్రిపత్రి కవాటం మూత
2) మిట్రల్ కవాటం మూత
3) 1, 2
4) అర్ధచంద్రాకార కవాటాల మూత
8. మిట్రల్ కవాటం ఉండే ప్రదేశం?
1) కుడి కర్ణికా జఠరిక రంధ్రం
2) ఎడమ కర్ణికా జఠరిక రంధ్రం
3) పుపుస ధమని మూలం
4) దైహిక ధమని మూలం
9. హార్థిక వలయంలో గుండె సిస్టోలు, డయాస్టోలుకు పట్టే సమయం?
1) 0.1 సె. 2) 0.3 సె.
3) 0.4 సె. 4) 0.8 సె.
10. మన నాడీ స్పందన రేటు, హృదయ స్పందన రేటు?
1) సమానంగా ఉంటుంది
2) నాడీ స్పందన రేటు కంటే హృదయ స్పందన రేటు ఎక్కువ
3) హృదయస్పందన రేటు కంటే నాడీ స్పందన రేటు ఎక్కువ
4) ఏదీకాదు
11. స్టెతస్కోపును కనుగొన్నది?
1) విలియం హార్వే
2) మార్సెల్లో మాల్ఫిజి
3) రెనిలెన్నెక్
4) గైరైలమా ఫాబ్రిసి
12. ద్వివలయ రక్త ప్రసరణలో రక్తం గుండె ద్వారా ఎన్ని సార్లు ప్రవహిస్తుంది?
1) 1 2) 2 3) 3 4) 4
13. రక్తం గడ్డకట్టిన తర్వాత పైన పేర్కొనే ద్రవం?
1) ప్లాస్మా 2) శోషరసం
3) సీరం 4) ఏదీకాదు
14. కణాల్లోని జీవపదార్థ కదలికను ఏమంటారు?
1) కశాభాల కదలిక
2) బ్రౌనియన్ చలనం
3) రోలింగ్ చలనం
4) రౌండ్ చలనం
15. వివృత రక్తప్రసరణ వ్యవస్థ గల జీవులు?
1) అనెలిడ 2) ఆర్థ్రోపొడ
3) చేపలు 4) మానవులు
16. రక్తపీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం?
1) బారోమీటర్ 2) థర్మామీటర్
3) స్పిగ్మోమీటర్ 4) గాల్వనోమీటర్
17. సాధారణ రక్తపీడనం?
1) 80/120 2) 120/80
3) 100/80 4) 80/100
18. రక్తం గడ్డకట్టడానికి పట్టే సమయం?
1) 2 నిమిషాలు 2) 3 నిమిషాలు
3) 3-6 నిమిషాలు
4) 5-10 నిమిషాలు
19. ప్రోత్రాంబిన్‌ను త్రాంబిన్‌గా మార్చడానికి త్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ తోడ్పడుతుంది. దీనిని విడుదల చేసేవి?
1) RBC 2) WBC
3) రక్తఫలకికలు 4) గ్రాన్యులోసైట్లు
20. 1 ఘ.మి.లీ రక్తంలోని RBCల సంఖ్య?
1) 5-9వేలు 2) 2-45 లక్షలు
3) 45-5.5 మిలియన్లు
4) 45-55 వేలు
Answers
1-4, 2-3, 3-3,4-3, 5-3, 6-3,7-3,8-1, 9-4, 10-1, 11-3 , 12-2, 13-3, 14-..15-2,16-3, 17-2, 18-3,19-3, 20-4
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

