1. కింది వాటిలో గరిష్ఠ స్థాయిలో బాష్పీభవనం ఎక్కడ జరుగుతుంది?
1) మొక్కల్లో 2) మహాసముద్రాలు
3) నదులు 4) మానవ శరీరం
2. గాలిలోని తేమ భూమి మీదకు చేరటాన్ని ఏమంటారు?
1) బాష్పీభవనం 2) అవపాతం
3) ద్రవీభవనం 4) బాష్పోత్సేకం
3. వాతావరణంలో ఏవి ఎక్కువగా ఉంటే చెమట, ఉక్కపోతలతో అసౌకర్యంగా ఉంటుంది?
1) ఆర్ధ్రత, అవపాతం
2) ఆర్ధ్రత, ఉష్ణోగ్రత
3) ఆర్ధ్రత, వాయువులు
4) ఆర్ధ్రత, మేఘాలు
4. వర్షాలు అధికంగా ఎక్కడ కురుస్తాయి?
1) ధృవాలు 2) భూభాగాలపై
3) ఎడారుల్లో 4) సముద్రాలపై
5. వర్షపాతాన్ని కొలిచే పరికరం పేరు?
1) వర్ష మాపకం 2) వర్ష సూచిని
3) రెయిన్ క్లాక్ 4) రెయిన్ మీటర్
6. యురేషియా అని ఏ రెండు ఖండాలను కలిపి పిలుస్తారు?
1) యూరప్, ఆస్ట్రేలియా
2) యూరప్, ఆసియా
3) యూరప్, అమెరికా
4) యూరప్, ఆఫ్రికా
7. కాకస్ పర్వతాలు ఏ రెండు సముద్రాల మధ్య నెలకొని ఉన్నాయి?
1) కాస్పియన్-నల్ల సముద్రాలు
2) కాస్పియన్-ఎర్ర సముద్రాలు
3) నల్ల సముద్రం-మధ్యధరా సముద్రాలు
4) నల్ల సముద్రం-ఉత్తర సముద్రం
8. కింది వాటిలో పెద్ద సరస్సులాంటి సముద్రం?
1) నల్ల సముద్రం 2) ఎర్ర సముద్రం
3) మధ్యధరా సముద్రం
4) కాస్పియన్ సముద్రం
9. స్కాండినేవియా ద్వీపకల్పంలోని భాగం?
1) నార్వే 2) స్వీడన్
3) ఇంగ్లండ్ 4) 1, 2
10. కింది వాటిలో అతి పెద్ద గల్ఫ్ సముద్రం?
1) బాల్టిక్ సముద్రం
2) ఉత్తర సముద్రం
3) మధ్యధరా సముద్రం
4) గల్ఫ్ ఆఫ్ ఎడెన్
11. 1750లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం?
1) ఫ్రాన్స్ 2) ఇంగ్లండ్
3) స్పెయిన్ 4) పోర్చుగల్
12. పశ్చిమ పవనాలు ఏ రకమైన గాలులు?
1) శీతల 2) అతి శీతల
3) తేమ 4) పొడి
13. యూరప్‌లోని పశ్చిమతీర జలాలను చలికాలంలో గడ్డకట్టకుండా సహకరించేది?
1) ఈక్వెడార్ స్ట్రీమ్
2) ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్
3) బెంగ్యులా ప్రవాహం
4) లారెన్షియం డ్రిఫ్ట్
14. మధ్యధరా రకపు శీతోష్ణస్థితి ఐరోపాలో ఎక్కడ ఉంది?
1) దక్షిణ ఐరోపా 2) ఉత్తర ఐరోపా
3) తూర్పు ఐరోపా
4) పశ్చిమ ఐరోపా
15. అమెరికాను చేరుకున్న మొదటి యూరోపియన్?
1) హెన్రీ 2) వాస్కోడిగామా
3) డయాజ్ 4) కొలంబస్
16. కొలంబస్ అమెరికాలోని ఏ ప్రాంతం చేరుకున్నాడు?
1) కెనడా తీరం 2) మెక్సికో తీరం
3) బ్రెజిల్ తీరం
4) పశ్చిమ ఇండస్ దీవులు
17. ప్రపంచంలో అతిపెద్ద బంగారం, వజ్రాల గని ఏ ఖండంలో ఉంది?
1) ఆసియా 2) ఆఫ్రికా
3) ఐరోపా 4) ఆస్ట్రేలియా
18. ఆఫ్రికా ఉత్తర భాగంలో ఉన్న గొప్ప ఎడారి?
1) కలహారి 2) అటకామా
3) సహారా 4) సొనారస్
19. కర్కట, మకర రేఖల మధ్య గల మండలం?
1) శీతల మండలం
2) సమశీతోష్ణ మండలం
3) అతిశీతల మండలం
4) ఉష్ణ మండలం
20. అయన రేఖా మండలం ఏ రెండు రేఖల మధ్య కలదు?
1) కర్కట రేఖ, అంటార్కిటిక్ వలయం
2) కర్కట రేఖ, భూమధ్య రేఖ
3) కర్కట రేఖ, మకర రేఖ
4) భూమధ్య రేఖ, ఆర్కిటిక్ వలయం
21. ఆఫ్రికాలోని గడ్డి భూములకు గల పేరు?
1) పంపాలు 2) సవన్నాలు
3) స్టెప్పీలు 4) ఏనుగు గడ్డి భూములు
22. భారతదేశానికి వాస్కోడిగామా చేరుకున్న సంవత్సరం?
1) 1492 2) 1498
3) 1502 4) 1507
23. ఆఫ్రికా ప్రజలను బానిసలుగా మార్చి ఏ ఖండానికి తీసుకెళ్లారు?
1) ఐరోపా 2) అమెరికా
3) ఆసియా 4) ఆస్ట్రేలియా
24. సూడాన్‌ను వలసగా మార్చుకున్న దేశం?
1) బెల్జియం 2) ఫ్రాన్స్
3) బ్రిటన్ 4) ఇటలీ
25. ఆఫ్రికా దేశాల్లో వలసగా మారని దేశం?
1) జైరీ 2) నమీబియా
3) కామెరూన్ 4) ఇథియోపియా
26. పశ్చిమ యూరప్ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సముద్ర ప్రవాహం?
1) ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్
2) బెంగ్యులా 3) కురోషివో
4) ఈక్వెడార్ స్ట్రీమ్
27. నైరుతి ఐరోపా నుంచి అమెరికా తూర్పు తీరానికి వీచే పవనాలు?
1) పశ్చిమ పవనాలు
2) వ్యాపార పవనాలు
3) రుతు పవనాలు
4) స్థానిక పవనాలు
28. మహానది జన్మ స్థలం?
1) మహాబలేశ్వరం 2) సిహావా
3) అమర కంఠక్
4)వరాహ పర్వతాలు
29. తుంగభద్రానది జన్మించే పర్వతాలు?
1) మానస సరోవరం
2) బ్రహ్మగిరి కొండలు
3) అమర్ కంఠక్
4) వరాహ పర్వతాలు
30. తూర్పు, పడమరలుగా భారతదేశ వెడల్పు?
1) 3,214 కి.మీ 2) 29,200 కి.మీ
3) 2,933 కి.మీ 4) 328 కి.మీ
31. భారతదేశంలో పగలు 12 గం. అయితే ఇంగ్లండ్‌లో ఎంత సమయం అవుతుంది?
1) ఉ.5 1/2 గం. 2) ఉ.6 1/2 గం.
3) సా.5 1/2 గం.
4) సా.6 1/2 గం.
32. గంగా, సింధు మైదానంలో టెరాయి ప్రాంతం అంటే?
1) ఎడారి ప్రాంతం
2) సచ్ఛిద్ర మండలం
3) చిత్తడి ప్రదేశం
4) నవీన ఒండలి మైదానం
33. తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం?
1) అరోమకొండ 2) అనైముడి
3) మహేంద్రగిరి 4) దొడబెట్ట
34. భారతదేశంలో అత్యంత పొడవైన కాల్వ?
1) జవహర్లాల్ నెహ్రూ కాల్వ
2) లాల్ బహదూర్ శాస్త్రి కాల్వ
3) సరస్వతి కాల్వ
4) ఇందిరాగాంధీ కాల్వ
35. లక్షదీవులు ఏ విధంగా ఏర్పడ్డాయి?
1) అగ్నిపర్వత చర్యల ద్వారా
2) ప్రవాళ భిత్తికల ద్వారా
3) సంపీడన శక్తుల ద్వారా
4) అవక్షేప చర్యల ద్వారా
36. ఎల్లోరాలోని 15వ నెంబర్ గుహలోని నరసింహ చిత్రం ఏ రాజుల కాలం నాటిది?
1) పల్లవులు 2) పశ్చిమ చాళుక్యులు
3) గుప్తులు 4) రాష్ట్రకూటులు
37. గూర్జర ప్రతీహార హరిశ్చంద్రుడు ఏ వర్ణానికి చెందినవారు?
1) బ్రాహ్మణ 2) క్షత్రియ
3) వైశ్య 4) శూద్ర
38. ప్రతీహార నాగభట్టుచే ఓడించబడ్డ కనోజ్ పాలకుడు?
1) హలాయుధుడు 2) చక్రాయుధుడు
3) ఇంద్రాయుధుడు 4) భోజుడు
39. త్రైపాక్షిక పోరాటం ఏ ప్రాంతం కోసం జరిగింది?
1) మగధ 2) కనోజ్
3) ఇంద్రప్రస్థ 4) పానిపట్టు
40. క్రీ.శ. 997-1030 మధ్య కాలంలో మధ్య ఆసియా నుంచి భారతదేశంపై దాడులు చేసిన ముస్లిం పాలకుడు?
1) మహ్మద్ ఘోరి
2) మహ్మద్ గజనీ
3) మహమ్మద్బీన్ ఖాసిం
4) మహ్మద్ బీన్ తుగ్లక్
41. 1192లో పృథ్వీరాజ్ చౌహాన్‌ను ఓడించినవారు?
1) మహ్మద్ గజనీ
2) మహ్మద్ ఘోరి
3) మహ్మద్ బీన్ తుగ్లక్
4) మహ్మద్ బీన్ ఖాసిం
42. చోళుల కాలంలో ఏ విగ్రహాల తయారీ ప్రసిద్ధి చెందింది?
1) కాంస్య 2) వెండి
3) బంగారం 4) ఇనుము
43. గంగైకొండ చోళపురం దేవాలయం నిర్మించినది?
1) రాజరాజు 2) కులోత్తుంగ చోళుడు
3) రాజేంద్రచోళ
4) విజయాలయుడు
44. చోళులు, బ్రాహ్మణులకు దానం చేసిన భూమికి గల పేరు?
1) శాలభోగ 2) వెల్లన్ వాగై
3) బ్రహ్మదేయ 4) దేవదాన
45. ప్రతీహార నాగభటునిచే ఓడించిన అనార్త అనే ప్రాంతం ఎక్కడ ఉంది?
1) మహారాష్ట్ర 2) మధ్యప్రదేశ్
3) గుజరాత్ 4) తెలంగాణ
46. కావేరి డెల్టా ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవుల సామంతుడు?
1) చోళులు 2) ముత్తరాయర్లు
3) రాష్ట్రకూటులు 4) పాండ్యులు
47. పెరియ పురాణం ఏ కాలానికి చెందినది?
1) క్రీ.శ. 9వ శతాబ్దం
2) క్రీ.శ. 10వ శతాబ్దం
3) క్రీ.శ. 11వ శతాబ్దం
4) క్రీ.శ. 12వ శతాబ్దం
48. 1000 నుంచి 1350 మధ్య కాలానికి చెందిన కథను గుర్తించండి?
1) పల్నాటి వీరుల కథ
2) కాటమరాజు కథ
3) సమ్మక్క సారక్క కథ
4) పైవన్నీ
49. రుద్రమదేవి పాలనా కాలం గుర్తించండి?
1) 1116-1157 2) 1158-1195
3) 1199-1262 4) 1262-1289
50. రుద్రమదేవి కాలంలో ఏపీని సందర్శించిన ఇటలీ యాత్రికుడు?
1) నికోలో కాంటే 2) మార్కోపోలో
3) పేయిజ్ 4) అబ్దుల్ రజాక్
51. కాకతీయుల పాలన అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్?
1) మహ్మద్ బీన్ తుగ్లక్
2) అల్లావుద్దీన్ ఖిల్జీ
3) ఫిరోజ్ షా తుగ్లక్ 4) బాల్బన్
52. కాకతీయుల పాలనలో మోటుపల్లి రేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు?
1) ఫాహియాన్ 2) ఇత్సింగ్
3) నికోలో కాంటే 4) మార్కోపోలో
53. క్రీ.శ. 14వ శతాబ్దంలో పల్నాటి వీరుల చరిత్రను రచించినవారు?
1) బాల చంద్రుడు 2) పోతన
3) శ్రీనాథుడు 4) ఎర్రన
54. ఎవరి పతనం తర్వాత కాకతీయులు సర్వ స్వతంత్రులయ్యారు?
1) విజయనగర రాజులు
2) ఢిల్లీ సుల్తానులు
3) పశ్చిమ చాళుక్యులు
4) చోళులు
55. ఇటలీ యాత్రికుడు మార్కోపోలోచే విశేషంగా కీర్తించబడిన భారతీయ ఉత్పత్తి?
1) పట్టు వస్ర్తాలు
2) నూలు వస్ర్తాలు 3) ఉన్ని వస్ర్తాలు
4) రసాయన వస్ర్తాలు
56. విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం?
1) 1333 2) 1336
3) 1343 4) 1347
57. బహమనీ రాజ్యం ఐదు రాజ్యాలుగా విడిపోయిన కాలం?
1) 1480-1520 2) 1489-1520
3) 1500-1530 4) 1490-1520
58. అబ్దుల్ రజాక్ విజయనగరానికి వచ్చినప్పుడు విజయనగర పాలకుడు?
1) మొదటి దేవరాయలు
2) రెండో దేవరాయలు
3) శ్రీకృష్ణ దేవరాయలు
4) అళియ రామరాయలు