సంస్కృతులు విభిన్నం.. అభిప్రాయాలు అసంఖ్యాకం
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు
1. ప్రజాస్వామ్య ప్రభుత్వం
- కొన్ని నియమాల ద్వారా, నిబంధనల ద్వారా సమాజం సక్రమంగా అభివృద్ధి చెందటానికి తోడ్పడే వ్యవస్థే ప్రభుత్వం
- ఇందుకోసం అందరికి వర్తించే విధంగా కొన్ని నిబంధనలు రూపొందించుకోవలసి ఉంది.
- ప్రభుత్వంలో భాగంగా నడిచే కొన్ని సంస్థలు
1. తపాలా కార్యాలయాలు
2. రాజమండ్రి రైల్వే స్టేషన్
3. సర్వోన్నత న్యాయస్థానం
వివిధ రకాల ప్రభుత్వాలు
- గిరిజన తెగల్లో ఏవైనా ప్రధాన నిర్ణయాల అమలుకు తెగలోని పురుషులందరూ హాజరవుతారు. వాటిపై చర్చిస్తారు. అక్కడ సమాజం చిన్నది, జనాభా తక్కువ.
- జనాభా వేలల్లో, లక్షల్లో ఉన్నప్పుడు ఇది అసాధ్యం. గిరిజన సమాజం వలె అందరూ ఒకే సమూహానికి, సంస్కృతికి చెందిన వారయితే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రవర్తన నియమావళి తయారు చేయడం సాధ్యమవుతుంది.
- కానీ ఇప్పటి సమాజంలో విభిన్న సంస్కృతుల ప్రజలకు ఇది పని చేయదు. గిరిజన ప్రజల జీవన విధానం ఆకాంక్షలు ఒకే విధంగా ఉంటాయి. వారిలో ధనవంతులు, పేదలు అనే అంతరాలుండవు.
- రైతులు, వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, భూమిలేని కూలీలు మొదలైనవారు నివసిస్తున్న బహుముఖ సమాజంలో అందరూ ఆమోదించే విధంగా ఒక సమస్య పరిష్కారం గాని, ప్రవర్తనావళి గాని రూపొందించడం సాధ్యం కాదు.
- గతంలో రాచరికం ఉండేది. వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరినీ సంప్రదించేవారు కాదు. వారి నిర్ణయాలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు
- ‘ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వం’ అని అబ్రహం లింకన్(అమెరికా) నిర్వచించారు.
- విభిన్న ప్రజల అభిప్రాయాలను ఇముడ్చుకుంటూ సమాజంలో అన్యాయం అణచివేతకు పాల్పడే శక్తులను నియంత్రించగలిగే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం.
- భారత దేశం ప్రజాస్వామ్య దేశం. విభిన్న మతాలు, భావాలు సంస్కృతులు, ఆకాంక్షలు గల సమావేశంలో పాలు పంచుకుంటే అసంఖ్యాకమైన అభిప్రాయాలు వెలువడుతాయి. ఇందుకు రెండు మార్గాలున్నాయి.
1. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం
2. మెజారిటీ పాలన - ఈ రోజుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నీ ప్రాతినిధ్య ప్రభుత్వాలే. ఈ విధానంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. ఉదా.. ఒక గ్రామంలో 200-500 వరకు జనాభా ఉండే గ్రామాన్ని వార్డులుగా విభజిస్తారు. ఒకొక్క వార్డు నుంచి ఒకొక్క ప్రతినిధిని ఎన్నుకుంటారు.
- ఈ ఎన్నికల్లో 18 సం. వయోజనులు పేద, ధనిక.. స్త్రీ, పురుష.. మత, భాష, నిరక్షరాస్యులు, విద్యాధికులు అనే భేదం లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పిస్తారు.
- ఎన్నికైన ప్రతినిధులు ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకుంటారు.
- ఎన్నికల ముందు ప్రజలు ఆలోచించి చర్చించి ఏయే అంశాల ఆధారంగా ప్రభుత్వం నడుచుకోవాలో నిర్ణయించుకుని ఓటు వేయాలి.
- ఎన్నికల ముందు అభ్యర్థులు తమ పార్టీ ఎన్నికైతే చేపట్టబోయే కార్యక్రమాల జాబితాను ఓటర్ల ముందు ఉంచుతారు.
- ఈ ప్రతినిధులు ఒక నిర్ణీత కాలానికి ప్రతినిధిగా ఉంటారు.
- భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.
- ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ ద్వారా ప్రతినిధులు ఎన్నికవుతారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అనుసరిస్తారు.
- ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ
- ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు రాజ్యాంగంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు న్యాయ స్థానాలు వారిని అనర్హులుగా ప్రకటిస్తాయి.
- ఎన్నికైన ప్రతినిధులను ఎవరైనా విమర్శించవచ్చు. వాటిని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియపరచవచ్చు.
సమానత్వం- ప్రజాస్వామ్యం
- ఓటు వేసేటప్పుడు నిర్భయంగా ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు వేయాలి. ప్రజలకు ప్రజాస్వామ్య విలువల పట్ల అవగాహన లేకపోవడం నిరక్ష్యరాస్యత కూడా ఒక కారణం.
- వివిధ విభాగాల్లో జరిగే విషయాలను తెలుసుకోవడానికి చాలా మంది ప్రజలు సమాచార హక్కు చట్టం వినియోగించుకోవటం లేదు.
- ముఖ్యంగా స్త్రీలు, పేదవారు ప్రజాస్వామ్యం వల్ల, ప్రజావసరాల పట్ల సరిగ్గా స్పందించడం లేదు.
- వారు వారి వారి పనుల్లో ఎక్కువ సమయం వెచ్చించడం దీనికి కారణం
- వీరిని ఎన్నికల్లో ప్రభావితం చేసి ధనవంతులు ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిసార్లు కులం, మతం కూడా ప్రజలపై ప్రభావం చూపుతుంది.
వివిధ స్థాయి ప్రభుత్వాలు
- ప్రభుత్వాలు వివిధ స్థాయిలలో పనిచేస్తాయి.
1. స్థానిక ప్రభుత్వాలు- పంచాయతీ, మున్సిపాలిటీలు
2. రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలు- ఆంధ్రప్రదేశ్, అసోం ప్రభుత్వాలు
3. జాతీయ స్థాయి ప్రభుత్వాలు- భారత ప్రభుత్వం
- ఆయా స్థాయిల్లో పరిపాలన విధానం గురించి తెలియజేసే నియమ నిబంధనలతో కూడిన పెద్ద గ్రంథమే భారత రాజ్యాంగం
వివిధ స్థాయిల్లో పరిపాలన నిర్వహించేవారు.
సర్పంచ్ గ్రామస్థాయి
మండల పరిషత్ అధ్యక్షులు మండల పరిషత్
జిల్లా పరిషత్ అధ్యక్షులు జిల్లా స్థాయి
ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయి
ప్రధానమంత్రి దేశ స్థాయి
అమెరికా రాజ్యాంగ పీఠికలోని ముఖ్యాంశాలు
- న్యాయ స్థాపనకు, శాంతి స్థాపనకు, ఉమ్మడి రక్షణ, ప్రజల సంక్షేమం చేపట్టడానికి రాబోయే తరాలు స్వేచ్ఛను అనుభవించడానికి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం
దక్షిణాఫ్రికా రాజ్యాంగ పీఠికలోని ముఖ్యాంశాలు
- గతంలో జరిగిన అన్యాయాలు గుర్తిస్తున్నాం
- భిన్నత్వంలో ఏకత్వంగా ఇక్కడే నివసించే ప్రజలందరికి ఈ దేశం చెందుతుంది.
- చట్టం, న్యాయం, రక్షణ ప్రతి వ్యక్తికి సమానంగా లభిస్తుంది.
- దక్షిణాఫ్రికా రాజ్యాంగ పీఠిక దేవుడు రక్షించుగాక, ఆశీర్వదించుగాక అనే పదాలతో ముగించబడింది.
- ఏ దేశ రాజ్యాంగమైనా రెండు ప్రధాన విధులను నిర్వర్తిస్తుంది.
- పౌరుల హక్కులు, విధులు పేర్కొనడం. కార్యనిర్వహణ, శాసన, న్యాయ శాఖల నిర్మాణం, అధికారాలు పేర్కొనడం.
- ప్రభుత్వం, సమాజం కలిసి నిర్మించాల్సిన భవిష్యత్ సమాజ స్వభావాన్ని సూచించడం.
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు
- భారత రాజ్యాంగాన్ని రూపొందించే కమిటీలో అధ్యక్షునితో పాటు ఆరుగురు సభ్యులు ఉన్నారు. వీరితో పాటు ఒక రాజ్యాంగ సలహాదారుడిని కూడా నియమించారు.
సభ్యులు
1. బి.ఆర్ అంబేద్కర్-అధ్యక్షులు
2. కె.ఎం. మున్షీ
3. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
4. ఎస్. గోపాల స్వామి అయ్యంగార్
5. వి.టి కృష్ణమాచారి
6. సయ్యద్ మహమ్మద్ సాదుల్లా సయ్యద్
7. ఎన్. మాధవరావు
- రాజ్యాంగ సభలో సభ్యుల్లో ప్రముఖులు నెహ్రూ, అంబేద్కర్, పటేల్, ఎన్.జీ రంగా, సరోజిని నాయుడు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, టి.ప్రకాశం.
రాజ్యాంగ ఆశయాలు, హామీలు
- మన రాజ్యాంగ తాత్వికతను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగంపై మన నాయకుల దృక్పథం చదవటం ద్వారా అర్థం చేసుకోవచ్చు.
- గాంధీ రాజ్యాంగ సభలో సభ్యుడు కాదు. అయితే అతని దృక్పథాన్ని అనుసరించిన సభ్యులు అనేక మంది సభలో ఉన్నారు.
- 1931లో యంగ్ ఇండియా అనే పత్రికలో భారత రాజ్యాంగం నుంచి ఆశిస్తున్న అంశాలను పేర్కొన్నారు.
- భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను.
- అత్యంత పేదలు ఇది తమ దేశమని దాని నిర్మాణంలో తమకూ పాత్ర ఉన్నదని భావించే భారతదేశం కోసం కృషి చేస్తారు.
- ఉన్నత వర్గ నిమ్న వర్గ ప్రజలు లేని భారతదేశం కోసం కృషి చేస్తాను.
- అన్ని మతాల వారు జాతుల వారు సామరస్యంతో ఉండే భారతదేశం కోసం కృషి చేస్తాను.
- అంటరానితనం, మత్తు పానీయాలు, మత్తు మందులు అనే శాపాలు ఉండవు
- మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉంటాయి.
- రాజ్యాంగ నిర్మాణంలో మార్గదర్శకాలుగా పని చేశాయి.
- ఉద్దేశాల తీర్మానంలో భారత ప్రజలకివ్వబడిన హామీలు-న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, గిరిజనుల, అణగారిన వర్గాల సంక్షేమం,ప్రపంచ శాంతి
- రాజ్యాంగాన్ని రూపొందించడానికి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
- మొత్తం రాజ్యాంగ సభ చర్చలు జరిపిన రోజులు 114.
- రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26న ఆమోదించింది.
- రాజ్యాంగంపై రాజ్యాంగ సభ సభ్యులు 1950, జనవరి 24న సంతకాలు చేశారు.
- 1950, జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
- 1950, జనవరి 26 నుంచి మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం. జనవరి 26ను గణతంత్ర లేదా రిపబ్లిక్ డేగా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటున్నాం.
- ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం
- లిఖిత రాజ్యాంగం లేని దేశం-బ్రిటన్
- 1947, ఆగస్టు 15 అర్ధరాత్రి సమయంలో రాజ్యాంగ సభనుద్దేశించి జవహర్లాల్ నెహ్రూ ప్రసంగించిన ఉపన్యాసంలో ప్రధానాంశాలు.
- మన భవిష్యత్ విశ్రాంతి సుఖాలతో ఉండబోవడం లేదు.
- గతంలో చేసిన ప్రతిజ్ఞలు నిలుపుకోవటానికి నిరంతరం శ్రమించాలి.
- భారత దేశానికి సేవ చేయడమంటే పేదరికం, అజ్ఞానం, రోగాలను అసమానతలను అంతం చేయడం.
- ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును తుడవాలని మన తరం నాయకుడు (గాంధీ) కలలు కన్నడు. అది సాధ్యం కాకపోవచ్చు.
రాజ్యాంగ తొలి ప్రతులు
- 1928లో మోతీలాల్ నెహ్రూ, కాంగ్రెస్‌కు చెందిన మరో 8 మంది కలిసి ఒక రాజ్యాంగాన్ని రూపొందిచారు.
- ఈ రెండు పత్రాలు కూడా సార్వజనీన వయోజన ఓటుహక్కు, స్వేచ్ఛ, సమానత్వపు హక్కు అనే వాటికి కట్టుబడి ఉన్నాయి.
- భారత రాజ్యాంగ రూపకల్పన-ఆదర్శాలు
- స్వాతంత్య్రం తర్వాత మెరుగైన సమాజాన్ని రూపొందించే విధానంపై నాయకుల్లో తీవ్రమైన అభిప్రాయ భేదాలుండేవి.
- అయినప్పటికీ స్వతంత్ర భారతదేశం కింది ప్రజాస్వామిక సూత్రాల ప్రకారం నడవాలని చాలా మంది అంగీకరించారు. అవి
1. చట్టం ముందు అందరూ సమానులే, అందరికి ప్రాథమిక హక్కులు
2. సార్వజనీన ఓటు హక్కు ద్వారా ఎన్నికయ్యే ప్రభుత్వం
భారత రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తినిచ్చిన అంశాలు
- దేశంలోని వివిధ రకాల ప్రజలు మెరుగైన సమాజం కోసం చేసిన పోరాటాలు.
- గాంధీ, ఇతర నాయకుల ఆలోచనలు
- ఫ్రెంచి విప్లవ ఆదర్శాలు, బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థ అమెరికాలోని హక్కుల చట్టం
- రష్యా, చైనా సోషలిస్టు విప్లవాలు, సామాజిక ఆర్థిక సమానతలు రుపుదిద్దేలా స్ఫూర్తినిచ్చాయి.
- బ్రిటన్ వలస పాలకులు చేసిన చట్టాలలోని అనుకూల విధానాలు.
- బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రజాస్వామిక, పాలనకు కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టారు. అయితే ఎన్నికల్లో కొద్ది మందికే ఓటు హక్కు బలహీన శాసన సభలు వంటివి ఇందులో లోపాలు.
- 1937లో ఎన్నికలు జరిగాయి అయితే ఇవి పూర్తి ప్రజాస్వామిక ఎన్నికలు కావు.
- అయితే ఈ ఎన్నికలు, శాసన సభలలో పొందిన అనుభవం స్వతంత్ర దేశంలో సొంత శాసనసభలు ఏర్పరచుకోవడంలో సహాయపడింది.
భారత రాజ్యాంగ సభ
- బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించినది.
- ఇతను మనదేశానికి మొదటి రాష్ట్రపతి. రాజ్యాంగ సభకు 1946, జూలైలో ఎన్నికలు జరిగాయి.
- రాజ్యాంగ సభ సభ్యులు దేశంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. వీరిలో భారతీయ కాంగ్రెస్‌కు చెందినవారు అధికులు. ఇతర పార్టీలకు చెందిన బి.ఆర్ అంబేద్కర్ లాంటి వారు తక్కువ.
- అధిక సంఖ్యాకులు ఒకే పార్టీకి చెందిన వారైనప్పటికీ పలు అంశాలపై వారి దృక్పథాల్లో ఎంతో తేడా ఉంది.
- మహిళల సంఖ్య కూడా చాలా తక్కువ. వీరి సంఖ్య 15 మాత్రమే. వారిలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఒకరు.
- 1947, ఆగస్టు 14న పాకిస్థాన్, భారతదేశంగా విభజించడంతో పాకిస్థాన్‌కు చెందిన సభ్యులు పాకిస్థాన్ రాజ్యాంగ సభగా ఏర్పడ్డారు.
– ఆంజనేయులు
ఫ్యాకల్టీ,ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

