హైదరాబాద్: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)- 2022ను నేడు జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీల్లో బీఏ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 25 రాష్ట్రాల్లోని 131 కేంద్రాల్లో పరీక్ష జరుగనున్నది.
ఈ ప్రవేశపరీక్షలో మొత్తం 22 లా యూనివర్సిటీలు, వాటి పరిధిలో ఉన్న 104 కాలేజీలు పాల్గొంటున్నాయి. వీటిలో ఆయా కోర్సుల్లో 2801 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో యూజీ కోర్సుల్లో 2 వేలకుపైగా సీట్లు ఉన్నాయి.