హైదరాబాద్: ఓయూ క్యాంపస్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) లిటరసీ హౌజ్‌లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు ఈ నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. యోగా, ఎంఎస్ ఆఫీస్- ఇంటర్నెట్ (ఆఫీస్ ఆటోమేషన్), ట్యాలీ- ఈఆర్పీ 9, బ్యూటీషియన్, టైలరింగ్, జూట్ బ్యాగ్ మేకింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్, గ్రాఫిక్స్ డిజైనింగ్, వాయిస్ ఓవర్, మీడియా రైటింగ్ తదితర కోర్సులను అందిస్తున్నట్టు పేర్కొన్నారు. వివరాలకు 9951210441, 8498080599, 040–27098406 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ 8వ సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. వివరాలకు www.osmania.ac.inలో చూడాలని అధికారులు సూచించారు.