పాలిసెట్‌కు సర్వం సిద్ధం.. 411 కేంద్రాల్లో పరీక్ష
పాలిసెట్| తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2021)కు సర్వం సిద్ధమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 411 కేంద్రాల్లో ఆఫ్‌లైన్ పద్ధతిలో ఈ పరీక్షను శనివారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పాలిసెట్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేశామని సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు.

హైదరాబాద్: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2021)కు సర్వం సిద్ధమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 411 కేంద్రాల్లో ఆఫ్‌లైన్ పద్ధతిలో ఈ పరీక్షను శనివారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పాలిసెట్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేశామని సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. కరోనా సోకిన అభ్యర్థులకు దవాఖానల్లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అందువల్ల కరోనా పాజిటివ్ అభ్యర్థులు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాసర ఆర్జీయూకేటీకి ప్రత్యేక మెరిట్ జాబితాలు పంపిస్తామని చెప్పారు. వ్యవసాయ, పశువైద్య కోర్సులకు ప్రత్యేక మెరిట్ జాబితాలు రూపొందిస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి పాలిటెక్నిక్ తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ ప్రత్యక్ష తరగతులపై తొందరపడబోమని ఆయన చెప్పారు.
పాలిసెట్ పరీక్షను శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకోసం 1,02,496 మంది దరఖాస్తు చేసుకున్నారు. గంట ముందునుంచే పరీక్ష హాలులోకి అనుమతిస్తామని, 11 గంటల తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Navin mittal
- Off line
- Polycet
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

