DOST | ‘అటానమస్’ హవా!.. ఆ కాలేజీల్లో చేరేందుకే విద్యార్థుల ఆసక్తి
DOST | మూడేండ్ల లో డిగ్రీ విద్యలో అటానమస్ కాలేజీలదే హవా సాగుతున్నది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలతో పోల్చినా అటానమస్ కాలేజీలకే అధిక డిమాండ్ ఉంటున్నది. దోస్త్ అడ్మిషన్లలో ఇదే పునరావృతమైంది.
DOST | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : మూడేండ్ల లో డిగ్రీ విద్యలో అటానమస్ కాలేజీలదే హవా సాగుతున్నది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలతో పోల్చినా అటానమస్ కాలేజీలకే అధిక డిమాండ్ ఉంటున్నది. దోస్త్ అడ్మిషన్లలో ఇదే పునరావృతమైంది. దోస్త్ మొదటి విడత సీట్లను గురువారం కేటాయించగా, 56,147 విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. వీరిలో 25 వేల మంది అటానమస్ కాలేజీల్లోనే చేరారు. అంటే 44 శాతం మంది అటానమస్ కాలేజీల్లోనే అడ్మిషన్లు పొందారన్నమాట. ప్రైవేట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. అటామనస్ కాలేజీల్లోని సీట్లే నిండుతున్నాయి. ఇక రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఎక్కువగా చేరుతున్నారు. ప్రస్తుతం 56వేల మంది ప్రవేశాలు పొందితే 54వేల మంది ఇంగ్లిష్ మీడియంలో చేరారు.
ప్రముఖ కాలేజీలు కావడంతోనే..
రాష్ట్రంలోని ప్రముఖ డిగ్రీ కాలేజీల్లో దాదాపు అన్ని అటామనస్ హోదా గలవే. 2004 నుంచి పలు కాలేజీలు అటానమస్ హోదా కలిగి ఉన్నాయి. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ, సిటీ కాలేజీ, బేగంపేట డిగ్రీ కాలేజీ, ఎస్సార్ఆర్(కరీంనగర్), ఎస్సార్‌బీజీఎన్నార్(ఖమ్మం), ఎన్జీ కాలేజీ(నల్లగొండ), పింగలి కాలేజీ(వరంగల్), గిరిరాజ్(ఖమ్మం) వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ప్రముఖ కాలేజీలు కావడం, రెండు దశాబ్దాలుగా అటానమస్ హోదా కలిగి ఉండటంతో ఇవి అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ కాలేజీల్లో పీహెచ్డీ ప్రొఫెసర్లు, సకల వసతులుండటమే కాకుండా, వినూత్నమైన కొత్త కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని కాలేజీలైతే 20-25 సర్టిఫికెట్ కోర్సులను నిర్వహించడమే కాకుండా ఎమర్జింగ్ టెక్నాలజీ, లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. మొత్తంగా ఈ కాలేజీలు మెరుగైన విద్య అందిస్తుండటం, ప్లేస్‌మెంట్స్ ఆశాజనకంగా ఉండటంతో విద్యార్థులు ఈ కాలేజీల బాట పడుతున్నారు.
ప్రభుత్వ కాలేజీకు విశేష ఆదరణ: శ్రీదేవసేన
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) మొదటి విడత సీట్ల భర్తీలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు విశేష ఆదరణ లభించినట్టు కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. తొలి దశలో 56,147 సీట్లు కేటాయించగా, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 27,853(49.6శాతం) సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. 19,774 సీట్లు ప్రభుత్వ స్వయం ప్రతిపత్తిగల కాలేజీల్లో భర్తీ కాగా, 8,079 సీట్లు సాధారణ కాలేజీల్లో భర్తీ అయ్యాయని తెలిపారు. కాలేజీల వారీగా తీసుకుంటే సిటీ కాలేజీలో 1,980 సీట్లకు 1,755 సీట్లు, ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 1,552 సీట్లు, గిరిరాజ్ కాలేజీలో 1,421 సీట్లు భర్తీ అయినట్టు వెల్లడించారు.

Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohabbat | యూత్‌ను ఆకట్టుకుంటున్న ‘మొహబ్బత్’ సినిమాలోని ‘వరమే’ లవ్ సాంగ్!
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో రూ.60 కోట్ల అసైన్డ్ భూముల స్కాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Naga Chaitanya | ‘వృషకర్మ’ రిలీజ్ వేళ నాగచైతన్య సాహస యాత్ర.. పెద్దపల్లి రామగిరి కోటపై ట్రెక్కింగ్ చేస్తూ ఆసక్తికర ముచ్చట్లు!
KTR | నియోజకవర్గాల పునర్విభజనపై మా వైఖరి ఎప్పుడైనా స్పష్టమే : కేటీఆర్
Mayawati | ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి: మాయావతి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

