లైఫ్‌లైన్ ఆఫ్ రాయలసీమగా ఏ నదిని పిలుస్తారు ?
భారతదేశం నేలలు
- జూన్ 27 తరువాయి
38. జతపరచండి.
1. మంజీర ఎ. అనంతగిరి కొండలు
2. ప్రాణహిత బి. బాలాఘాట్
3. ఇంద్రావతి సి. దండకారణ్యం
4. కృష్ణా డి. చామోషి
5. మూసీ ఇ. మహాబలేశ్వరం
ఎ) 1-బి, 2-డి, 3-సి, 4-ఇ, 5-ఎ
బి) 1-ఇ, 2-సి, 3-డి, 4-ఎ, 5-బి
సి) 1-బి, 2-డి, 3-సి, 4-ఇ, 5-ఎ
డి) 1-డి, 2-ఎ, 3-సి, 4-ఇ, 5-బి
39. కింది వాటిలో లైఫ్‌లైన్ ఆఫ్ రాయలసీమగా ఏ నదిని పిలుస్తారు.
ఎ) పినాకిని బి) కావేరి
సి) తుంగభద్ర డి) భీమ
40. కింది వాటిలో ఏ నదికి మీనాంబరం అని పేరు ఉంది?
ఎ) పెన్నా బి) దిండి
సి) చిత్రావతి డి) మూసీ
41. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రబ్బరు డ్యామ్‌ని కింది ఏ నదిపై నిర్మించారు?
ఎ) నాగావళి బి) వేదవతి
సి) జంఝావతి డి) బ్రాహ్మాణి
42. కింది వాటిలో సహస్రధార జలపాతం ఏ నదిపై ఉంది?
ఎ) నర్మద బి) తాపి
సి) మహానది డి) కావేరి
43. భారత దేశంలోని ఎత్తయిన జలపాతం ఏ నది పై ఉంది?
ఎ) నేత్రావతి బి) పంపా
సి) శరావతి డి) సబర్మతి
44. అహ్మదాబాద్ కింది వాటిలో ఏ నది తీరాన ఉంది?
ఎ) తపతి బి) నర్మద
సి) సబర్మతి డి) మూసీ
45. భారతదేశంలో పశ్చిమం వైపునకు ప్రవహిస్తున్న నదుల్లో అతిపొడవైనది?
ఎ) నర్మద బి) తాపి
సి) సబర్మతి డి) మహీ
46. కింది వాటిలో ‘సాల్ట్ రివర్’ అని దేన్ని అంటారు?
ఎ) లూని బి) సాగరమాత
సి) కౌసల్య డి) జోర్గి
47. కింది వాటిలో దేన్ని సరస్సుల నగరంగా పిలుస్తారు?
ఎ) రాజ్‌కోట్ బి) ఉదయ్‌పూర్
సి) జైపూర్ డి) ఏదీకాదు
48. భారతదేశంలో అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడిన ఏకైక సరస్సు?
ఎ) సాంబార్ బి) లోనార్
సి) లోక్తక్ డి) పుష్కర్
49. కింది వాటిలో అతిపెద్ద మానవనిర్మితమైన సరస్సు?
ఎ) దేభర్ బి) దాత
సి) దిద్వానా డి) లునార్
50. జతపరచండి.
1. విరూపకారక
సరస్సు ఎ. సాంబార్
2. లాగూన్ సరస్సు బి. కొల్లేరు
3. హిమానీనద సరస్సు సి. ఊలార్
4. పవన చర్యల సరస్సు డి. రాకన్ఠాల్
ఎ) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
బి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
సి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
డి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
51. జతపరచండి. సరస్సులు ప్రత్యేకతలు
1. చిలికా సరస్సు ఎ. అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడింది
2. చో-లామ-సరస్సు బి. అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు
3. ఊలార్ సరస్సు సి. అతి పొడవైన ఉప్పునీటి సరస్సు
4. సాంబార్ సరస్సు డి. అతిపెద్ద మంచినీటి సరస్సు
5. లోనార్ సరస్సు ఇ. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు
ఎ) 1-సి, 2-బి, 3-డి, 4-ఇ, 5-ఎ బి) 1-సి, 2-బి, 3-ఇ, 4-డి, 5-ఎ
సి) 1-సి, 2-ఎ, 3-డి, 4-ఇ, 5-బి డి) 1-ఇ, 2-బి, 3-డి, 4-ఎ, 5-సి
52. భారతదేశంలో వేడినీటి బుగ్గలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి.
ఎ) మనికరన్-హిమాచల్‌ప్రదేశ్, తపోవన్-జార్ఖండ్, రాజ్‌గిర్-బీహార్
బి) టాటపాని- సిమ్లా, వైవీశ్వరి-మహారాష్ట్ర, పున్కాగ్-కశ్మీర్
సి) బక్రీశ్వర్-బీహార్, మనికరన్-హిమాచల్ ప్రదేశ్, రాజ్‌గిర్-బీహార్
డి) టాటపాని-సిమ్లా, బయుమ్టన్-సిక్కిం, తపోవన్ – జార్ఖ్ండ్
53. కింది వాటిలో ఏ రెండు నదులు అమర్‌కంటక్‌లో జన్మిస్తాయి.
ఎ) కెన్-బెట్వా
బి) ఇంద్రావతి-ఘటప్రభ
సి) నర్మద-తాపి
డి) నర్మద-సోన్
54. కింది భారతదేశ సరస్సులను దక్షిణం నుంచి ఉత్తరానికి అమర్చండి.
1. ఊలార్ 2. దాత్
3. బేబర్ 4. పుష్కర్
5. సాంబార్ 6. లోనార్
7. లోక్తక్
ఎ) 6, 3, 7, 4, 5, 1, 2
బి) 1, 2, 5, 4, 7, 3, 6
సి) 6, 3, 7, 4, 5, 2, 1
డి) 6, 3, 4, 7, 5, 2, 1
55. లైఫ్‌లైన్ ఆఫ్ ది కేరళగా ఏ నది ప్రసిద్ధి?
ఎ) పెన్నా బి) పెరియార్
సి) తామ్రపాణి డి) పైవేవీ కావు

1. భారతదేశంలో వివిధ రకాల నేలలు వాటి విస్తీర్ణం ఆధారంగా క్రమపద్ధతిలో అమర్చండి.
1. అటవి నేలలు 2. ఎడారి నేలలు
3. ఎర్ర నేలలు 4. నల్లరేగడి నేలలు
5. పీట్ నేలలు 6. ఒండ్రు నేలలు
ఎ) 6, 3, 4, 2, 1, 5
బి) 6, 4, 3, 2, 1, 5
సి) 6, 3, 4, 1, 5, 3
డి) 6, 3, 4, 1, 2, 5
2. కింది వాటిలో భాస్వరం, హ్యూమస్, నైట్రోజన్ తక్కువగా ఉండి పొటాషియం ఎక్కువగా కలిగిన నేలలు ఏవి?
ఎ) లాటరైట్ నేలలు బి) ఎర్ర నేలలు
సి) ఒండ్రు నేలలు డి) అటవి నేలలు
3. భారతదేశపు ధాన్యాగారాలు గా ఏ రకమైన నేలలను అభివర్ణిస్తారు?
ఎ) నల్లరేగడి బి) ఒండ్రు
సి) ఎర్రనేలలు డి) లాటరైట్
4. జతపరచండి.
1. నల్లరేగడి ఎ. అల్యూమినియం, ఐరన్, టైటానియం
2. ఎర్రనేలలు బి. ఐరన్, పొటాషియం
3. లాటరైట్ నేలలు సి. సేంద్రీయ పదార్థం, నత్రజని
4. అటవి నేలలు డి. అల్యూమినియం, మెగ్నీషియం, ఇనుము
5. ఎడారి నేలలు ఇ. ఫాస్ఫేట్స్
ఎ) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి, 5-ఇ బి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి, 5-ఇ
సి) 1-ఇ, 2-బి, 3-ఎ, 4-సి, 5-డి డి) 1-ఇ, 2-బి, 3-డి, 4-సి, 5-ఎ
5. కింది వాటిలో వేటిని యుగోస్లేవియాలోని టెర్రరోస్ నేలలతో పోలుస్తారు?
ఎ) ఎర్రనేలలు బి) లాటరైట్ నేలలు
సి) ఒండ్రు నేలలు
డి) నల్లరేగడి నేలలు
6. జతపరచండి.
1. ఒండ్రు నేలలు ఎ. నైట్రోజన్, ఫాస్ఫరస్, హ్యూమస్
2. నల్లరేగడి నేలలు బి. పొటాషియం, సున్నం, ఫాస్ఫరస్
3. అటవి నేలలు సి. నైట్రోజన్, భాస్వరం, హ్యూమస్
4. ఎర్ర నేలలు డి. నైట్రోజన్, సేంద్రియ పదార్థాలు, ఫాస్ఫరస్
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి బి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి డి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
7. కింది వాటిలో నేలల క్రమక్షయానికి గల కారణాలను గుర్తించండి.
1. వరదలు
2. ఎరువుల వినియోగం పెరగడం
3. పవనాలు
4. పోడు వ్యవసాయం
ఎ) 1, 2, 3, 4 బి) పైవన్నీ
సి) 2, 3, 1 డి) 1, 2, 3
8. భారతదేశంలో నల్ల రేగడి నేలల ప్రాంత పరిశోధన కేంద్రం ఎక్కడ నెలకొల్పారు?
ఎ) ఆగ్రా బి) ఊటీ
సి) బళ్లారి డి) నాగపూర్
9. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్‌కు సంబంధించి సరికాని అంశాలను గుర్తించండి.
1. SHC ని 3 సంవత్సరాలకు ఒకసారి జారీ చేస్తారు
2. SHC పథకం భారతదేశంలో అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది
3. SHCలో రైతు తన భూమికి సంబంధించిన పూర్తి వివరాలు పొందుతారు
4. SHCని నిర్వహించేది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 4 డి) పైవేవీకావు
10. అటవి నేలల ప్రాంత పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) ఊటీ బి) బళ్లారి
సి) జోధ్‌పూర్ డి) భోపాల్
11. మృత్తిక క్రయక్షయ నివారణకు సంబంధించి సరికాని అంశాలను గుర్తించండి.
1. పోడు వ్యవసాయం పెంచాలి
2. అడవుల పెంపకం
3. కాంటూర్ బండింగ్స్ నిర్మించడం
4. ప్రాజెక్ట్ నిర్మాణం
ఎ) 1 బి) 2, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 3, 4
12. కింది వాటిలో రేగూర్ నేలలకు సంబంధించి సరికాని అంశాలను గుర్తించండి.
1. వీటిని తమంతట తాము దున్నుకునే నేలలుగా కూడా పిలుస్తారు
2. భారతదేశంలో నల్లరేగడి నేలలు 19 శాతం విస్తరించి ఉన్నాయి
3. వీటిని స్వతఃసిద్ధ వ్యవసాయ నేలలుగా కూడా పిలుస్తారు
4. ఈ నేలలు బసాల్ట్ శిలల అవక్షేపం ద్వారా ఏర్పడతాయి
ఎ) 1, 3, 4 బి) 1, 2, 3, 4
సి) 2 డి) 1, 2, 3
13. నేలల పార్శ రేఖా కృతిని పై నుంచి కిందకు క్రమపద్ధతిలో గుర్తించండి.
1. మాతృశిల ఎ) ఉపరితల పొర
బి) శైథిల్యం చెందిన శిల ముక్కలు
సి) ఉపమృత్తిక
ఎ) 1, 4, 3, 2 బి) 1, 2, 3, 4
సి) 2, 4, 3, 1 డి) 2, 4, 1, 3
14. కింది నేలల ఏర్పాటుకు దోహదపడే కారకాలు కాని వాటిని గుర్తించండి.
1. సహజ ఉద్బిజ్జ సంపద
2. సూక్ష్మ జీవులు
3. వర్షపాతం
4. మాతృశిల
5. నైసర్గిక స్వరూపం
ఎ) 1, 2, 3, 4, 5 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) పైవేవీ కావు
15. మృత్తిక క్రమక్షయ నివారణకు చర్యలను గుర్తించండి.
1. కాంటూరు బండింగ్స్
2. డ్యామ్స్ నిర్మాణం
3. షెల్టర్ బెట్స్
4. అంతర పంటలు
5. మల్చింగ్
ఎ) 1, 2, 3 బి) 5, 4, 2, 3, 1
సి) 3, 4, 1, 2 డి) 5, 2, 3, 1
16. కింది వాటిలో కోస్తా తీర ప్రాంతంలో నేలల క్రమక్షయ నివారణ కోసం ఏ విధానం ఉపయోగిస్తారు?
ఎ) అంతరపంటలు
బి) కాంటూరు బండింగ్స్
సి) షెల్టర్ బెల్ట్స్
డి) మల్చింగ్

– ఎం.ప్రవీణ్ కుమార్
విషయనిపుణులు
హైదరబాద్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

