రోదసీలో అడుగిడిన యూరి గగారిన్ జయంతి.. చరిత్రలో ఈరోజు

అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిన యూరి గగారిన్ 1934 లో సరిగ్గా ఇదే రోజున జన్మించారు. పుట్టిన 27 సంవత్సరాల వయస్సులో అంటే 1961 ఏప్రిల్ 12 న అతను వోస్టాక్-1 అనే అంతరిక్ష నౌకలో ప్రయాణించి రోదసీలోకి ప్రవేశించారు. బేకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి బయల్దేరిన
అతడి వాహనం భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడటానికి సెకనులో 5 మైళ్ళు ప్రయాణించి రికార్డు సృష్టించింది.
రైతు కుటుంబంలో జన్మించిన యూరి గగారిన్‌కు చిన్ననాట నుంచి అంతరిక్షం గురించి ప్రత్యేక ఆసక్తి కనబర్చేవాడు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా సోవియట్ యూనియన్ను హస్తగతం చేసుకునేందుకు నాజీలు కుట్రపన్నిన సమయంలో యూరి కుటుంబం అనేక కష్టాలను ఎదురుచూసింది. కుటుంబం కోసం 16 ఏండ్ల వయసులో మాస్కోకు సమీపంలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ సాయంత్రం పాఠశాలలో విద్యాభ్యాసం చేసేవాడు.
1951 లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యూరి గగారిన్.. 1957 లో సోవియట్ ఎయిర్‌ఫోర్స్‌లో లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరాడు. మొత్తం 166 గంటల 47 నిమిషాల పాటు విమానాలు నడిపిన అనుభవం గడించాడు.
1961 ఏప్రిల్ 12 న అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడిగా చరిత్రపుటలకెక్కాడు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించిన తొలి మనిషిగానూ రికార్డులకెక్కాడు. అంతరిక్షంలోకి ప్రయాణించినందుకు ప్రపంచంలోని అనేక దేశాలు, పతకాలు, బహుమానాలు ఇచ్చి ఇతడిని గౌరవించాయి. రష్యన్లు ఇతడిని సోవియట్ హీరోగా పరిగణిస్తారు. సోవియట్ యూనియన్ అతడని ప్రపంచంలోని వివిధ దేశాలకు రాయబారిగా నియమించింది. గగారిన్ వ్యోమగాముల శిక్షణా స్థలం అయిన స్టార్ సిటీలో ఉప-శిక్షణాధికారిగా నియమితుడయ్యాడు. అదే సమయంలో ఇతను ఫైటర్ పైలట్‌గా తిరిగి అర్హత పొందేందుకు ప్రయత్నించసాగాడు. 1968 మార్చి 27 న చకలోవ్స్కీ ఎయిర్ బేస్ నుంచి శిక్షణ విమానంలో ఎగురుతుండగా మిగ్-15 యూటీఐ విమానం కిర్జాచ్ పట్టణం వద్ద కూలిపోయి గగారిన్తోపాటు అతడి శిక్షకుడు వ్లాదిమీర్ సెరిఓజిన్ మరణించారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు:
2004: 2000 కిలోమీటర్ల పరిధిలో ఉపరితలం నుంచి ఉపరితలంకు దాడి చేయగల ‘షాహీన్-2’ క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్
1999: భారతీయ సంతతి పారిశ్రామికవేత్త స్వరాజ్ పాల్‌కు గౌరవ డాక్టరేట్ బహూకరించిన బ్రిటన్‌లోని సెంట్రల్ బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం
1986: మొదటి ఉపగ్రహ ఆధారిత టెలిఫోన్ కనెక్టివిటీ నెట్వర్క్ లాంఛనంగా ప్రారంభం
1973: ఉత్తర ఐర్లాండ్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటన్‌తో కలిసి ఉండటానికి అనుకూలంగా ఓటు వేసిన 57 శాతం మంది ప్రజలు
1967 : రష్యాను విడిచి వెళ్లిపోయిన స్టాలిన్ కుమార్తె స్వెత్లానా
1959: న్యూయార్క్‌లోని అమెరికన్ టాయ్ ఫెయిర్‌లో బార్బీ డాల్ మొదటిసారి పరిచయం
1956: లండన్‌లో భారత దౌత్యవేత్త, కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ జననం
1951: ప్రముఖ తబలా వాయిద్యగాడు, పద్మభూషణ్ జాకీర్ హుస్సేన్ జననం
1945: అమెరికన్ వైమానిక దళం టోక్యోలో బాంబు దాడులు చేయడంతో 80 వేల మందిని దుర్మరణం
1454: ఇటాలియన్ నగరమైన ఫ్లోరెన్స్‌లో సముద్రయానకుడు అమెరిగో వెస్పుచి జననం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

