Yash 19 | కేజీఎఫ్ ప్రాంచైజీతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు కన్నడ స్టార్ హీరో యశ్ (Yash). ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రికార్డులను క్రియేట్ చేసింది. కాగా ఈ స్టార్ హీరో నెక్ట్స్ ప్రాజెక్ట్ యశ్ 19 (Yash 19)కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు.
ఓ ఈవెంట్లో యశ్ మాట్లాడుతూ.. నేను రిలాక్స్ అవడం లేదు. నేను ఏదైనా చేస్తున్నానంటే మీరందరూ ఇచ్చిన ధైర్యం వల్లే.. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను.. సగం వండిన ఆహారాన్ని మాత్రం వడ్డించలేను. దయచేసి కొంచెం ఓపిక పట్టండి.. మీరంతా గర్వపడేలా సినిమా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చేశాడు. యశ్ తాజా కామెంట్స్‌తో అభిమానులకు కిక్కెక్కించేలా అప్డేట్ అందించింది. యశ్ 19 డిసెంబర్ చివరలో షూటింగ్ షురూ కానుందని.. శ్రీలంకలో 45 రోజులపాటు సింగిల్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
యశ్ చాలా రోజుల క్రితం మలేషియాలో జరిగిన ఓ ఈవెంట్లో ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. నేను ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం చాలా హార్ట్ వర్క్ చేస్తున్నా. ఈ సినిమా భారీ స్థాయిలో ఉంటుందని చెప్పను.. కానీ ఇది ఒక మంచి, అద్భుతమైన సినిమా కానుంది. ఈ సినిమాను త్వరలోనే ప్రకటిస్తా. ఓపిక పట్టండి. నన్ను నమ్మండి. మీ అంచనాలకు తగ్గకుండా అదిరిపోయే కిక్కించేలా సినిమా ఉంటుందని మాత్రం చెప్పగలను.. అని ఇప్పటికే చెప్పాడు యశ్.
పాపులర్ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ (KVN Production) యశ్‌తో 19వ ప్రాజెక్ట్‌ను చేయబోతున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తుండగా.. దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
#RockingsStarYash speaks about regarding #Yash19 .
“I am not relaxing; if I am doing something, it’s all because of the courage you guys have given so far. One thing, I don’t want to serve half-baked food. Please have a little patience; a film that we all will be proud ” pic.twitter.com/YzT0leW5vW
— Filmy Corner ꭗ (@filmycorner9) November 23, 2023
Exclusive
🔹#Yash19 Shooting December Month Start 📢 Set Work Already Start
Follow For More update 🙏
🔸First Schedule “SaiLanka” 90% Shoot Next Schedule “Bangalore” 10% Remaining#Yash #GeethuMohandas #YashBOSS #Yash20 #YashBOSS𓃵 #KVNProduction #KGF3 pic.twitter.com/Y4lrXo6ur2
— Movie Tamil (@MovieTamil4) October 26, 2023