Y Chromosome | క్రమంగా కనుమరుగవుతున్న ‘వై’ క్రోమోజోమ్స్.. మగ జాతి అంతమవుతుందా?!
తల్లి కడుపులోని బిడ్డ లింగాన్ని నిర్ధారించడంలో పురుషుల శుక్రకణాల్లోని వై-క్రోమోజోమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, గడిచిన కొంతకాలంగా ఈ జన్యువుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్నదని, రానున్న కాలంలో ఇవి కనుమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదని జపాన్‌లోని హొక్కయిడో యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.
- 900 జన్యువుల నుంచి 55కు పడిపోయిన వైనం
- జపాన్ పరిశోధకుల అధ్యయనంలో కీలక విషయాలు
- లింగ నిర్ధారణలో ‘వై’ క్రోమోజోమ్స్దే కీలక పాత్ర
Y Chromosome | న్యూఢిల్లీ, ఆగస్టు 23/(స్పెషల్ టాస్క్ బ్యూరో): తల్లి కడుపులోని బిడ్డ లింగాన్ని నిర్ధారించడంలో పురుషుల శుక్రకణాల్లోని వై-క్రోమోజోమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, గడిచిన కొంతకాలంగా ఈ జన్యువుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్నదని, రానున్న కాలంలో ఇవి కనుమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదని జపాన్‌లోని హొక్కయిడో యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇదే జరిగితే, భవిష్యత్తులో పురుష జననాలు ఉండకపోవచ్చని పరిశోధకులు అంచనాకు వచ్చారు. అయితే, వైద్యశాస్త్రంలో అమల్లోకి వచ్చిన వినూత్న పద్ధతులు, ఆవిష్కరణల ద్వారా కొత్త జన్యువుల సృష్టితో ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం అంత పెద్ద కష్టమేమీ కాదని వాళ్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివరాలు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
కనుమరుగు ఇలా..
మనుషులు సహా క్షీరదాల వంటి పాలిచ్చే ఆడ జంతువుల్లో రెండు ‘ఎక్స్’ క్రోమోజోమ్స్ ఉంటాయి. మగవాటిలో ఒక ఎక్స్ క్రోమోజోమ్‌తో పాటు ఒక వై క్రోమోజోమ్ కూడా ఉంటుంది. ఇదే గర్భంలోని శిశువు లింగాన్ని నిర్ధారిస్తుంది. అయితే, పురుషుల్లోని ఎక్స్ క్రోమోజోమ్‌లో 900 వరకూ వివిధ రకాల జన్యువులు ఉండగా, ‘వై’ క్రోమోజోమ్‌లో మాత్రం వాటి సంఖ్య 900 నుంచి 55కు పడిపోయినట్టు పరిశోధకులు గుర్తించారు. గడిచిన 166 మిలియన్ సంవత్సరాల్లో ఈ మేరకు జన్యువుల క్షీణత జరిగినట్టు తెలిపారు. ఇది కొనసాగితే రానున్న 110 లక్షల ఏండ్లలో ‘వై’ క్రోమోజోమ్‌లోని మిగిలిన 55 జన్యువులు(ఎస్‌ఆర్‌వై జన్యువులు) కనిపించకుండా పోవచ్చని, గర్భంలోని ప్రతి శిశువు ఆడ శిశువుగానే పుట్టొచ్చని అభిప్రాయపడ్డారు.
వై క్రోమోజోమ్ ఎందుకు కీలకం?
గర్భం దాల్చిన 12 వారాల తర్వాత వృషణాలు ఏర్పడటాన్ని క్రమబద్ధీకరించే వాటిని ఈ ‘వై క్రోమోజోమ్’ ప్రేరేపిస్తుంది. గర్భస్థ పిండం వృషణాలు పురుష హార్మోన్లను (టెస్టోస్టిరాన్ వంటివాటిని) తయారు చేస్తాయి. ఫలితంగా బిడ్డ మగ శిశువుగా రూపొందుతాడు. అందుకే ఈ ‘వై క్రోమోజోమ్’ను మాస్టర్ సెక్స్ జీన్‌గా పిలుస్తారు.
అలా జరుగొచ్చు కూడా..
తూర్పు ఐరోపాలో కనిపించే మోల్ వోల్స్ అనే ఎలుక జాతికి చెందిన మగ జంతువులు, జపాన్‌లో కనిపించే మగ స్పైన్ ఎలుకల్లో ఇప్పటికే ‘వై’ క్రోమోజోమ్స్ అంతరించిపోయాయని పరిశోధకులు తెలిపారు. అయినప్పటికీ, ‘వై’ క్రోమోజోమ్‌లోని జన్యువుల లక్షణాలు కలిగిన మరికొన్ని కొత్త జన్యువులు(ప్యూ జీన్స్) ఆయా మగ జీవుల్లో కొత్తగా పుట్టుకురావడంతో వాటి జాతి అంతరించిపోలేదని, కొత్తగా మగ పిల్లలు కూడా పుడుతున్నట్టు పరిశోధకులు తెలిపారు. మనుషుల్లోనూ ఇలానే జరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

