మామిడి పచ్చడి తెచ్చిన తంటా.. హాస్పిటల్‌పాలైన మహిళ
హాస్పిటల్ డాక్టర్లు తొలుత దీనిని లైట్‌గా తీసుకున్నారు. మామిడి పచ్చడి తినడం వల్ల ఆమె గొంతుకు గాయం అయిన సంగతిని వారు నమ్మలేకపోయారు. సమస్య తీవ్రంగా ఉంటే హాస్పిటల్‌కు రావాలని చెప్పి పంపారు
లండన్: మామిడి పచ్చడి పేరు ఎత్తితేనే నోరూరుతుంది. అలాంటి పచ్చడి ఒక మహిళకు తంట తెచ్చింది. ఆమెను ఆసుపత్రిపాలు చేసింది. దీంతో మామిడి కాయను కూడా ప్రమాదకరమైనదిగా భావించాలని పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ వింత సంఘటన బ్రిటన్‌లో జరిగింది. సర్రే ప్రాంతానికి చెందిన 57 ఏళ్ల మహిళ ఇటీవల మామిడి పచ్చడి తిన్నది. అయితే మామిడి ముక్కకు ఉన్న టెంక ఆమె గొంతులో గుచ్చుకోవడంతోపాటు ఇరుక్కుంది. దీంతో మింగేందుకు ఇబ్బంది పడిన ఆ మహిళ స్థానిక హాస్పిటల్‌కు వెళ్లింది. జరిగిన విషయాన్ని డాక్టర్లకు చెప్పింది.
కాగా, హాస్పిటల్ డాక్టర్లు తొలుత దీనిని లైట్‌గా తీసుకున్నారు. మామిడి పచ్చడి తినడం వల్ల ఆమె గొంతుకు గాయం అయిన సంగతిని వారు నమ్మలేకపోయారు. సమస్య తీవ్రంగా ఉంటే హాస్పిటల్‌కు రావాలని చెప్పి పంపారు. అయితే ఆ మహిళ ఆహారం మింగలేక తెగ ఇబ్బంది పడింది. నాలుగు రోజుల తర్వాత తిరిగి ఆసుపత్రికి వెళ్లింది.
దీంతో డాక్టర్లు ఆమె పరిస్థితిని సీరియస్‌గా పరిగణించారు. సీటీ స్కాన్ తీసి గొంతు వద్ద గాయాన్ని గుర్తించారు. చిన్న మామిడి టెంక ఇరుక్కుని ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆమెకు అత్యవసరంగా సర్జరీ నిర్వహించి దానిని బయటకు తీశారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ వారం రోజులపాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది.
మరోవైపు డాక్టర్లు తన సమస్యను తొలుత లైట్‌గా తీసుకోవడంపై హాస్పిటల్ ట్రస్ట్‌కు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. ఆ మహిళకు క్షమాపణలు చెప్పడంతోపాటు ఆసుపత్రి మార్గదర్శకాలను సవరించారు. చికెన్ ఎముకల మాదిరిగానే మామిడి కాయ వల్ల కూడా గొంతులో గాయం వంటి ప్రమాదాలు జరిగే అవకాశమున్నదని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

