అగ్ర హీరో మహేష్‌బాబు తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’తో రికార్డులు మొదలుపెట్టారు. ఈ చిత్రంలోని ‘కళావతి’ లిరికల్ సాంగ్ అతి తక్కువ సమయంలో 100 మిలియన్ వ్యూస్ సాధించిన తెలుగు పాటగా రికార్డ్ సృష్టించింది. గత నెల 13వ తేదీన ఈ పాటను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. మంగళవారానికి 100 మిలియన్ వ్యూస్ మార్ దాటేసింది. దీంతో ఈ ఫీట్‌ను టీమ్ సెలబ్రేట్ చేసుకుంటోంది. ‘కళావతి’ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా థమన్ స్వరపరిచారు. సిధ్ శ్రీరామ్ ఆలపించారు. ఈ లిరికల్ సాంగ్‌ను గాయనీ గాయకులతో పాటు మొత్తం ఆరెస్ట్రాతో చిత్రీకరణ చేశారు. పాటకు మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటతో పాటు ఇది మరొక ఆకర్షణ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంయుక్త నిర్మాణంలో పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న విడుదల కానుంది.