ప్రతీవారం మాదిరే ఈ వారం కూడా చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులోనూ చాలా రోజుల తర్వాత మూడు క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. అందులో నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు.. రాజేంద్ర ప్రసాద్ గాలి సంపత్.. శర్వానంద్ శ్రీకారం సినిమాలు ఉన్నాయి. దాంతో పాటు కన్నడ హీరో దర్శన్ నటించిన రాబర్ట్ కూడా ఈ వారమే వచ్చింది. మరి ఈ 4 సినిమాల్లో ప్రేక్షకుల మెప్పు పొందిన సినిమా ఏది..? వేటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం..
జాతిరత్నాలు
ఈ వారం విడుదలైన సినిమాల్లో కమర్షియల్ బ్లాక్ బస్టర్ రేంజ్ కు చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్న సినిమా జాతి రత్నాలు. కొత్త దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ఈ లాజిక్ లేని కామెడీ మ్యాజికల్ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షోతో సినిమా రేంజ్ మార్చేశాడు. తొలిరోజే రూ.5 కోట్ల షేర్ వసూలు చేసింది జాతి రత్నాలు.
శ్రీకారం
చాలా రోజుల తర్వాత శర్వానంద్ నుంచి వచ్చిన మంచి సినిమా శ్రీకారం. శతమానం భవతి తర్వాత గాడి తప్పిన ఈయన కెరీర్ ను మళ్లీ రైట్ ట్రాక్ ఎక్కించింది ఈ చిత్రం. కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించిన శ్రీకారం తొలిరోజు రూ.4.5 కోట్ల షేర్ వసూలు చేసింది. లాంగ్ వీకెండ్ ప్లస్ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గాలి సంపత్
అనిల్ రావిపూడి బ్రాండ్ తో వచ్చిన ఈ చిత్రానికి ఆదరణ కరువైంది. రాజేంద్ర ప్రసాద్ బాగా నటించినా కూడా కథ, కథనం వీక్ కావడంతో సినిమా చేతులెత్తేసింది.
రాబర్ట్
ఈ కన్నడ డబ్బింగ్ సినిమా వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఒకవైపు మన సినిమాలకే థియేటర్స్ సరిపోక ఇబ్బందులు పడుతుంటే.. పక్క స్టేట్ నుంచి వచ్చిన రాబర్ట్ ను మన ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు.