నిమ్మకాయ తొక్కు ఆరోగ్యానికి మంచిదేనా?

మన తెలుగు వంటకాల్లో తొక్కులది ప్రత్యేక స్థానం. ఏ కూరతో భోజనం చేసినా మొదటి ముద్ద తొక్కులతో ఉండాల్సిందే. అయితే నిల్వ ఉంచే తొక్కులు ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది వాదిస్తున్నారు. ఇప్పటి పిల్లలు తొక్కులతో తినేందుకు ఇష్టపడటం లేదు. కానీ తొక్కుల్లో ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా పుల్ల పుల్లగా కారం కారం ఉండే నిమ్మకాయ తొక్కుతో ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజూ నిమ్మకాయ తొక్కు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం

రక్తపోటు నియంత్రణ
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా ఉండాలి. రక్త ప్రవాహంలో హెచ్చు తగ్గులు రక్తపోటుకు కారణమవుతుంది. అయితే రోజూ నిమ్మకాయ తొక్కుతో తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది
నిమ్మకాయ తొక్కులో ఎన్నో పోషకాలు ఉంటాయి. పైగా కొవ్వు అసలు ఉండదు. హృద్రోగాలు వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని నిరభ్యంతరంగా డైట్లో చేర్చుకోవచ్చు.

ఎముకలు బలంగా ఉంటాయి
నిమ్మకాయలో కాపర్, పొటాషియం, ఐరన్, కాల్షియం ఉంటాయి. వయసు పెరిగే కొద్ది ఎముకల ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. కాబట్టి కాల్షియం, విటమిన్ ఏ, సీ, పొటాషియం కలిగిన నిమ్మకాయ తొక్కును ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
రోగ నిరోధక శక్తి పెంపు
సప్లిమెంట్ల ద్వారా విటమిన్లు, పోషకాలను తీసుకోవడానికి బదులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అలాంటి ఆహారాల్లో నిమ్మకాయ తొక్కు ఒకటి. ఇందులో బీ కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

జీర్ణ క్రియ మెరుగు
నిమ్మకాయ తొక్కు తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. నిమ్మలో ఉండే ఎంజైములు శరీరంలోని విషతుల్యాలను తొలగించడంలో సహకరిస్తాయి. దీనివల్ల బరువు పెరగకుండా ఉంటారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

