మహిళా వ్యాపారులకు సహకారం: సీతక్క
మహిళా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు పెట్టుబడులు, మారెట్లు, కార్పొరేట్ భాగస్వామ్యాలను అందుబాటులోకి తేనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): మహిళా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు పెట్టుబడులు, మారెట్లు, కార్పొరేట్ భాగస్వామ్యాలను అందుబాటులోకి తేనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (డబ్ల్యూఈఈసీ)ను ఏర్పాటు చేసిందని తెలిపారు. మంత్రి సీతక అధ్యక్షతన, వీ-హబ్ సీఈవో సీత పల్లచోళ్ల కన్వీనర్‌గా ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 నేపథ్యంలో సోమవారం సచివాలయంలో కౌన్సిల్ తొలి సమావేశం జరిగింది.
ఈ కౌన్సిల్లో విధాన నిర్ణేతలు, మహిళా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు, మారెట్ అవకాశాలు, విధానపరమైన సహకారం కల్పించేందుకు ఈ కౌన్సిల్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళా వ్యాపారవేత్తలకు పెట్టుబడులు, వినియోగదారులు, మారెట్ నెట్వర్లే ప్రధాన సవాళ్లు అని సీత పల్లచోళ్ల తెలిపారు. కౌన్సిల్ సిఫార్సులతో మహిళా పారిశ్రామిక రంగంపై ప్రత్యేక శ్వేతపత్రాన్ని గ్లోబల్ సమ్మిట్‌లో విడుదల చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వీ-హబ్ నోడల్ ఏజెన్సీగా సిఫార్సుల అమలుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేయనున్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

