న్యూఢిల్లీ, డిసెంబర్ 7: టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా…తన ఇంటర్నేషనల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ పనితీరును మెరుగుపర్చేందుకు హైదరాబాదీ టెలికం సొల్యూషన్స్ కంపెనీ తాన్లాతో ఒప్పందం కుదుర్చుకుంది. వొడాఫోన్ మెసేజింగ్ ట్రాఫిక్‌కు మైక్రోసాఫ్ట్‌తో కో డెవలప్‌చేసిన వైజ్లీపై ఎన్‌క్రిప్ట్ చేస్తామని తాన్లా ప్లాట్‌ఫామ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ రెడ్డి తెలిపారు. డిజిటల్ ఇంటరాక్షన్స్ స్పేస్‌లో తమ భాగస్వామ్యం..తాన్లా అంతర్జాతీయ విస్తరణకు తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేసారు.