వీకే శశికళకు షాక్.. ఓటరు జాబితాలో పేరు గల్లంతు
ఓటరు జాబితాలో వీకే శశికళ పేరు గల్లంతు | దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ పేరు ఓటరు జాబితాలో గల్లంతైంది

చెన్నై : దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు మరో షాక్ తగిలింది. ఓటరు జాబితాలో ఏకంగా ఆమె పేరు గల్లంతైంది.
శాసనసభ ఎన్నికల పోలింగ్కు ఒక్కరోజు ముందు ఈ విషయం వెలుగులోకి రావడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
అమ్మల్ మక్కల్ మున్నేట్ర కఝగం (ఏఎంఎంకే) అధినేత టీటీవీ దినకరణ్ దీన్ని ఏఐఏడీఎంకే కుట్రగా ఆరోపిస్తున్నారు. విషయంపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
20 ఏండ్లుగా థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఆమెకు ఓటు హక్కు ఉంది. కాగా పోయెస్ గార్డెన్లోని ఆస్తులను జప్తు చేశాక ఆమె పేరును అధికారులు తొలగించారని సమాచారం.
అక్రమాస్తుల కేసులో నాలుగేండ్లు జైలుశిక్ష అనుభవించిన శశికళ జనవరి 27న విడుదలయ్యారు. అనంతరం రాజకీయాల నుంచి తప్పుకుంటూ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

