విశాఖ ఉక్కుకు ఏపీ సంబంధం లేదంట!

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ కంపెనీకి, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. విశాఖ స్టీల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఈక్విటీ లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సోమవారం లోక్‌సభలో వైఎస్ఆర్సీపీ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ పై విధంగా అన్నారు. విశాఖ స్టీల్స్‌లో వందశాతం పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్పాదకత సామర్థ్యం పెంచడానికే ప్రైవేటీకరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. భాగస్వాములు, ఉద్యోగులు.. విశాఖ స్టీల్స్‌లో షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం సంపాదించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

