ViratKohli | ట్రావిస్ హెడ్‌తో గొడవ.. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన విరాట్ కోహ్లీ!
Travis Head | ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఊహించని వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Travis Head | ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఊహించని వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో చోటుచేసుకున్న మాటల యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ క్రీజులో ఉండగా, ఫీల్డింగ్ చేస్తున్న ట్రావిస్ హెడ్ ఆయనను ఉద్దేశించి ఏదో కామెంట్ చేశారు. అయితే హెడ్ అన్న మాటలకు కోహ్లీ తీవ్రంగా స్పందించారు. హెడ్ వైపు కోపంగా చూస్తూ.. ‘నువ్వు వచ్చి బౌలింగ్ చెయ్, చూసుకుందాం’ అన్నట్లుగా చేతులతో సైగలు చేస్తూ సీరియస్ అయ్యారు.
అయితే ఈ గొడవ అంతటితో ముగిసిపోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు ఆనవాయితీ ప్రకారం ఒకరికొకరు కరచాలనం (షేక్ హ్యాండ్) ఇచ్చుకునే సమయంలో అసలు డ్రామా జరిగింది. ట్రావిస్ హెడ్ నవ్వుకుంటూ కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచగా, విరాట్ కోహ్లీ ఆయనను పూర్తిగా విస్మరించాడు. హెడ్‌ను కనీసం పట్టించుకోకుండా, ఆయన వైపు చూడకుండా నేరుగా ముందుకు వెళ్ళిపోయారు. మైదానంలో స్లెడ్జింగ్ సహజమే అయినప్పటికీ, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కోహ్లీ అంతటి పట్టుదలతో ఉండడం, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ‘కోహ్లీ వర్సెస్ హెడ్’ వివాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Virat Kohli refused handshake with Travis Head, as both had some heat moments between the game. SRH vs RCB ☠️ #ViratKohli #RCB #IPL #SRHvsRCB pic.twitter.com/7j6kdaCyxB
— 𝐙𝐮𝐛𝐚𝐢𝐫𝐑🕊 (@iiZub22) May 22, 2026
Virat Kohli is literally a cry baby.He himself trigger Travis Head first and now doing these cheap things by not shaking head .He is a shame for this gentleman game.#viratkohli #shame pic.twitter.com/QszZSj0GZN
— Hitman 45 (@Hitman450745) May 22, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

