చండీఘడ్: బాలీవుడ్ నటి సారా అలీఖాన్, క్రికెటర్ శుభమన్ గిల్ ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు కాస్త కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఆ ఇద్దరూ డిన్నర్ చేయడంతో వారి మధ్య డేటింగ్ నడుస్తున్నట్లు అనుమానిస్తున్నారు. టిక్‌టాక్ యూజర్ ఉజ్మా మర్చెంట్ ఆ వీడియోను పోస్టు చేశారు. ముంబైలోని బాస్టియన్ హోటల్లో సారా, గిల్లు డిన్నర్ చేశారు. అయితే సచిన్ కూతురు సారా టెండూల్కర్‌తో గిల్ డేటింగ్ చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సారా టెండూల్కర్, గిల్ ఈ మధ్యే సోషల్ మీడియాలో అన్‌ఫాలో అయ్యారు. దీంతో వాళ్లు బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది. కానీ కొత్త జంటపై ఇంటర్నెట్లో కామెంట్లు హోరెత్తిస్తున్నాయి.