నట్టిక్రాంతి హీరోగా ఐదు భాషల్లో రూపొందిన చిత్రం ‘వర్మ’. ‘వీడుతేడా’ అనేది ఉపశీర్షిక. ముస్కాన్, సుపూర్ణ మలాకర్ నాయికలు. నట్టి కుమార్ దర్శకుడు. నట్టి కరుణ నిర్మాత. జనవరి 21న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ సాఫ్ట్వేర్ కుర్రాడి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ చిత్ర కథ కొనసాగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వుంటుంది’ అన్నారు.