పిల్లాడిని నలిపేసిన ట్రెడ్ మిల్

మీ ఇంట్లో ట్రెడ్ మిల్ ఉందా ? అయితే జాగ్రత్త. పసిపిల్లలు, పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు ట్రెడ్ మిల్ దరిదాపుల్లోకి రానీయకండి. అలా ట్రెడ్ మిల్ ఉన్నచోట పొరపాటున మీ పిల్లలు వస్తే ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో చెబుతూ ఓ వీడియోని విడుదల చేసింది యూఎస్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్.
అక్కతో కలిసి ఆడుకుంటున్న చిన్నారిని ట్రెడ్ మిల్ అమాంతం లాగేసింది. చిన్నారి చేతులు ట్రెడ్ మిల్ కింద నలిగాయి. ఆ తర్వాత కాసేపటికే పిల్లాడు కూడా ట్రెడ్ మిల్ కిందకు వెళ్లిపోయాడు. నొప్పిని తట్టుకోలేక కాసేపు ఆ చిన్నారి గిలాగిలా కొట్టుకున్నాడు. అతి కష్టం మీద బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఏడ్చుకుంటూ అక్కడి నుంచి పరుగులు పెట్టాడు.
ఆ చిన్నారి అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే చనిపోయేవాడు. ఇలాంటి ఘటనలు అమెరికాలో జరగడం ఇది మొదటిసారి కాదు. పెలటాన్ కంపెనీకి చెందిన ట్రెడ్ మిల్ ప్లస్ వల్ల ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా 40మందికి పైగా చిన్నారులు గాయపడ్డారు. ఈ కంపెనీ ట్రెడ్ మిల్ ని వాడవద్దని ఇప్పటికే అమెరికా కంజుమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ ఆదేశించింది. అయితే సదరు కంపెనీ ఈనిర్ణయాన్ని తప్పుబట్టింది. 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉండే వ్యక్తులు దీన్ని ఉపయోగించకూడదని సేఫ్టీ రూల్స్ లో స్పష్టం చేశామని వివరణ ఇచ్చింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

