Airline Pass | ఎయిర్‌లైన్ పాస్ కొన్న వ్యక్తి.. 33 ఏళ్లలో 37 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణం
Airline Pass | ఒక వ్యక్తి ఎయిర్‌లైన్ పాస్ (Airline Pass) కొనుగోలు చేశాడు. 33 ఏళ్లలో ఏకంగా 37 మిలియన్ కిలోమీటర్ల మేర విమానాల్లో విహరించాడు. ఒక సంవత్సరంలో భూమి, చంద్రుడు మధ్య ఉన్న దూరాన్ని ఆరుసార్లు కంటే ఎక్కువగానే ప్రయాణించి రికార్డు సృష్టించాడు.
వాషింగ్టన్: ఒక వ్యక్తి ఎయిర్‌లైన్ పాస్ (Airline Pass) కొనుగోలు చేశాడు. 33 ఏళ్లలో ఏకంగా 37 మిలియన్ కిలోమీటర్ల మేర విమానాల్లో విహరించాడు. ఒక సంవత్సరంలో భూమి, చంద్రుడు మధ్య ఉన్న దూరాన్ని ఆరుసార్లు కంటే ఎక్కువగానే ప్రయాణించి రికార్డు సృష్టించాడు. అగ్ర దేశమైన అమెరికాలో ఈ సంఘటన జరిగింది. 69 ఏళ్ల టామ్ స్టూకర్, న్యూజెర్సీలోని ఆటో కంపెనీకి కన్సల్టెంట్. 1990లో 2,90,00 డాలర్లు (సుమారు 2.4 కోట్లు) చెల్లించి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నుంచి జీవితకాల విమాన పాస్ కొనుగోలు చేశాడు. నాటి నుంచి ఇప్పటి వరకు 33 ఏళ్లలో సుమారు 23 మిలియన్ మైళ్ల దూరాన్ని (37 మిలియన్ కిలోమీటర్లు) వేలాది విమానాల్లో ప్రయాణించాడు. అంతరిక్షంలో అపోలో 11 ప్రయాణించిన 22 మిలియన్ మైళ్ల దూరం కంటే భూమిపై ఎక్కువగా ప్రయాణించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
కాగా, టామ్ స్టూకర్ ఏకంగా 12 రోజుల పాటు ఇంట్లోని మంచంపై నడుంవాల్చలేదు. ఏకధీటుగా విమానాల్లో ప్రయాణించాడు. నెవార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో, అక్కడి నుండి బ్యాంకాక్, ఆ తర్వాత దుబాయ్‌కి వరుసగా విహరించాడు. నాలుగు వరల్డ్ టూర్లకు ఇది సమానం. ఈ 12 రోజుల్లో ఎయిర్పోర్ట్ లాంజ్ల్లోనే ఉన్నాడు. అలాగే చాలాసార్లు సుల్తాన్ మాదిరిగా ప్రపంచంలోని లగ్జరీ హోటల్లోని సూట్లో బస చేశాడు. 33 ఏళ్లలో ప్రపంచం నలు మూలలు చుట్టి వచ్చాడు. అతడు తరచుగా తనకు ఇష్టమైన 1బీ సీటులోనే విమానాల్లో ప్రయణించేవాడు.
మరోవైపు టామ్ స్టూకర్ 2019లో మరో ఘనత సాధించాడు. ఆయన ప్రయాణాల్లో అత్యుత్తమ ఏడాది అది. ఏకంగా 373 విమానాల్లో 1.46 మిలియన్ మైళ్ల దూరాన్ని ఎయిర్‌లైన్ పాస్‌తో ప్రయాణించాడు. అతడు డబ్బులు చెల్లించినట్లయితే 2.44 మిలియన్ డాలర్లు (సుమారు 20 కోట్లు) ఖర్చయ్యేది. కాగా, 33 ఏళ్ల కిందట సుమారు రూ.2.4 కోట్లతో జీవితకాల విమాన పాస్ కొన్న అతడు దీని వల్ల చాలా లబ్ధిపొందానని, తన జీవితంలో అత్యుత్తమ పెట్టుబడి అని తెలిపాడు. మరోవైపు ఆ వ్యక్తికి జీవితకాల పాస్ అమ్మిన ఆ విమాన సంస్థ నిర్ణయం చాలా తప్పు అని ది వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

