బంగారు రంగు దుస్తుల్లో మెరిస్తేనే పుత్తడిబొమ్మలా ఉందంటారు. మరి, ఏకంగా 24 క్యారెట్ల బంగారంతో తయారుచేసిన గౌను వేసుకుంటే ఎలా ఉంటుంది? అవును, అసలు సిసలు బంగారు గౌనులో ర్యాంప్‌పై నడిచి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది బాలీవుడ్ నటి ఊర్వశి రవుతెల్లా. ఇటీవల జరిగిన అరబ్ ఫ్యాషన్ వీక్‌లో బంగారం, వజ్రాలతో డిజైన్ చేసిన గౌను ధరించి ర్యాంప్ వాక్ చేసింది ఊర్వశి. అంతేకాదు అరబ్ ఫ్యాషన్ వీక్‌లో మొదటిసారి ర్యాంప్ వాక్ చేసిన భారతీయ షోస్టాపర్ కూడా తనే. ఆమె బంగారు గౌనులో నడిచొస్తుంటే అందరికీ క్లియోపాత్ర గుర్తొచ్చిందట. ఆ గౌను విలువ అక్షరాలా రూ.40 కోట్లు.