కుమార్తెను నరికి.. తలతో గ్రామంలో నడిచిన తండ్రి

లక్నో: కుమార్తెను నరికిన తండ్రి ఆమె తలతో గ్రామంలో నడిచాడు. భయాందోళన చెందిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో ఈ దారుణం జరిగింది. పాండేటర గ్రామానికి చెందిన సర్వేష్ కుమార్ అనే వ్యక్తి బుధవారం తన 17 ఏండ్ల కుమార్తెను నరికి చంపాడు. అనంతరం ఆమె తలతో గ్రామంలో నడవసాగాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడకు చేరుకున్నారు. సర్వేష్‌ను అడ్డుకుని అరెస్ట్ చేశారు.
పోలీసులు అతడ్ని ప్రశ్నించగా తన కుమార్తె ఒకరితో సంబంధం కలిగి ఉన్నదని, అందుకే హత్య చేసినట్లు చెప్పాడు. ఆమె మృతదేహాం ఇంట్లో ఉన్నదని తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హర్దోయి పోలీస్ స్టేషన్ అధికారి కపిల్ డియో సింగ్ చెప్పారు. మృతురాలి తలను పట్టుకుని ఫొటోకు ఫోజులిచ్చి అనుచితంగా ప్రవర్తించిన ఒక పోలీస్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

