నిండుకుండలా తుంగభద్ర డ్యాం

అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్థిరంగా చేరుతుండటంతో నిండుకుండను తలపిస్తోంది. మంగళవారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 14,340 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 13,873 క్యూసెక్కులు ఉంది.
100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గాను, ప్రస్తుతం 1633.00 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వ నాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు ..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆనకట్టకు వరద చేరు తోంది. మంగళవారం ఆనకట్ట కు 9,310 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 8,800 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు.
ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 9 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 510 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

