మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయం : మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ : ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మాట్లాడారు.
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వామ్యులేనని ఆయన పేర్కొన్నారు. వారి సహకారంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ఉద్యోగుల శ్రమ స్పష్టంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు. అటువంటి ఉద్యోగులు మండలి ఎన్నికల్లో నూటికి నూరు శాతం టీఆర్ఎస్నే బలపరుస్తున్నారని, ఇందులో ఎటువంటి సందేహాలకు ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి పక్షాలు ఆడుతున్న అబద్ధాలకు ఆచార్య కోదండరామ్ వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ పాలన రాక్షసత్వాన్ని మరిపిస్తోందని ఆయన విమర్శించారు.
బీజేపీ పాలనలో సామాన్యులకు ఆదాయం తగ్గిందని, అదే సమయంలో అంబానీ, ఆదానీల ఆదాయం మాత్రం రెట్టింపు అయిందంటూ ఆయన దెప్పి పొడిచారు.700 శాతం ఆదాయం ఆదానిది పెరిగితే అంబానీది 370 శాతానికి పెరగడమే అందుకు నిదర్శనమన్నారు. వంట గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నా బీజేపీ పాలకుల్లో చలనం లేదని దుయ్యబట్టారు. డీజిల్,పెట్రోల్ ధరలు అందనంత దూరం పోతుండడంతో సామాన్యులు కుదేలు అవుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. కార్యక్రమలో శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ మండలి సభ్యుడు పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

