బాలీవుడ్ అగ్ర నాయిక దీపికా పడుకోన్ తాజాగా ధరించిన దుస్తులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నాయి. షూటింగ్‌కు వెళ్లేందుకు ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన దీపిక బిగుతైన ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించింది. ఆమె వేసుకున్న ప్యాంట్, టీ షర్ట్ పూర్తిగా రెడ్ కలర్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పైగా హీల్స్ వేసుకుంది. విమాన ప్రయాణంలో ఇలాంటి బిగుతైన దుస్తులు, హీల్స్ వేసుకోవడం ఏమాత్రం సౌక్యంగా ఉండవని నెటిజన్లు ట్రోలింగ్స్ చేస్తున్నారు. అలాగే ప్రతి సందర్భంలో వింత వింత ఫ్యాషన్ దుస్తులతో ప్రత్యక్షమయ్యే దీపిక భర్త రణ్వీర్ సింగ్ ప్రభావంతోనే ఆమె ఇలాంటి దుస్తులు ధరించిందనే కామెంట్స్ రాస్తున్నారు. రణ్వీర్ ఈ దుస్తులు డిజైన్ చేశాడని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఏమైనా తన కొత్త కాస్ట్యూమ్‌తో దీపిక ట్రోలర్స్‌కు పని కల్పించింది. ప్రస్తుతం దీపిక తెలుగులో ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రంలో నటిస్తున్నది.