అనువాదాలు అదరహో
హీరో నితిన్ ఓ అరుదైన ఘనతను సాధించారు. హిందీలోకి డబ్బింగ్ చేసిన ఆయన సినిమాలు దక్షిణాది కథానాయకులందరి కంటే అత్యధిక వీక్షణల్ని పొందాయి. 2.3 బిలియన్ల (230కోట్లు) యూట్యూబ్ వీక్షణలతో నితిన్ చిత్రాలు అగ్రభాగాన నిలిచాయి. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. నిర్మాతలకు హిందీ అనువాద హక్కులు చక్కటి ఆదాయ వనరుగా మారాయి. శాటిలైట్ మరియు యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా హిందీ ప్రేక్షకులు తెలుగు సినిమాల్ని విరివిగా వీక్షిస్తున్నారు. అదే వరుసలో హీరో నితిన్ తన సినిమాల ద్వారా అక్కడి వారికి చేరువయ్యారు. హిందీలోకి డబ్బింగ్ అయిన ఆయన సిమాలన్నీ కలిపి 230కోట్ల యూట్యూబ్ వీక్షణలు సాధించాయి. హిందీలో ఈ స్థాయి ఆదరణ పొందిన తొలి దక్షిణాది హీరో నితిన్ కావడం విశేషం. అలాగే నితిన్ హిందీ డబ్బింగ్ చిత్రాలు భారీ మొత్తాలకు అమ్ముడుపోవడంతో నిర్మాతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంలో నటిస్తున్నారు. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌కు కూడా భారీ డిమాండ్ ఉందని సమాచారం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

