హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు. వివిధ రకాలుగా నిరసన తెలపాలని యువజన కాంగ్రెస్కు సూచించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు జూబ్లీహిల్స్ ఇంటి వద్ద రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.