తెలంగాణ యాసలో ఎంటర్టైన్ చేయనున్న ‘బేబమ్మ’

ఉప్పెన చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది మంగళూరు అమ్మడు కృతిశెట్టి. తొలి సినిమా ఉప్పెనలో బేబమ్మ (సంగీత)పాత్రతన అందం, అభినయంతో దర్శకనిర్మాతలు, హీరోల దృష్టిని ఆకర్షించారు. ఈ భామ తాజాగా ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఈ ప్రాజెక్టుకు ఫైనల్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది.
ఈ చిత్రంలో హైదరాబాదీ అమ్మాయి పాత్రలో కనిపించనుందని లేటెస్ట్ టాక్. ఈ మూవీలో బేబమ్మ తెలంగాణ యాసలో మాట్లాడబోతుందట. క్యూట్ క్యూట్ గా తన లుక్‌తో అలరించిన కృతిశెట్టి..ఈ సారి తెలంగాణ మాండలికంలో డైలాగ్స్ చెప్తూ తనలోకి మరో యాంగిల్‌ను కూడా ఆడియెన్స్ కు పరిచయం చేయబోతుందన్నమాట.
ఈ మూవీలో శ్రీకాంత్ అయ్యంగార్, కల్యాణీ నటరాజన్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్‌రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీకి సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీత దర్శకుడు వివేక్‌సాగర్, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

