రాజకుటుంబంలో నరకం తట్టుకోలేకే అమెరికాకు..

లాస్ ఏంజెలిస్: బ్రిటన్ రాజకుటుంబంలో ఉండే కష్టాలు, బాధలు భరించలేకే ఆ వలయం నుంచి బైటపడ్డానని యువరాజు హ్యారీ చెప్పారు. తండ్రి యువరాజు చార్లెస్ కుటుంబంలోని వనారందరూ తనను ఎలా చూశారో నన్నూ అలాగే చూశారు అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రాజకుటుంబంలో జాతివివక్ష ఉన్నాయని ఇటీవలే ఓప్రా విన్ ఫ్రే షోలో హ్యారీ, మేఘన్ మర్కెల్ దంపతులు సంచలన విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. తన తండ్రి తమకు వచ్చే నిధులను కూడా ఆపించారని హ్యారీ తెలిపారు. తాజాగా ఆర్మ్ చైర్ ఎక్స్ పర్ట్ అనే పాడ్ కాస్ట్ కార్యక్రమంలో డ్యాక్స్ షెపర్డ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన తండ్రిని నిందించదలుచుకోలేదని చెప్పారు. ఆయన లాగా నా పిల్లలను పెంచొద్దని అనుకుంటున్నాను అని హ్యారీ చెప్పారు. ఈ వలయాన్ని ఛేదించేందుకే రాజకుటుంబం నుంచి బయటకు వచ్చి అమెరికాలో స్థిరపడ్డానని వివరించారు. తన తండ్రి కూడా రాజకుటుంబపు ఇబ్బందులతోనే పెరిగారని పేర్కొన్నారు. విన్ ఫ్రే షోకు హ్యారీ, మేఘన్ ఇచ్చిన ఇంటర్వ్యూతో బ్రిటన్ రాజకుటుంబం 1997లో యువరాణి డయానా చనిపోయినప్పటి స్థాయిలో ఇరకాటంలో పడింది. ఇటీవలి కాలంలో హ్యారీ, మేఘన్ వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలనం కలిగిస్తున్నారు. త్వరలో వారిపై మరో డాక్యుమెంటరీ సిరీస్ ఈ నెల 21 నుంచి యాపిల్ టీవీలో “ద మీ యూ కాంట్ సీ” అనే పేరుతో మొదలుకానున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

