Shubhapradam Shopping Mall | అనకాపల్లిలో ‘శుభప్రదం’ సందడి: హీరోయిన్లు మానస వారణాసి, శ్రీదేవి జాబిలి చేతులమీదుగా గ్రాండ్ ఓపెనింగ్!
అనకాపల్లి పట్టణ వాసులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని పంచేందుకు 'శుభప్రదం షాపింగ్ మాల్' అత్యంత వైభవంగా అడుగుపెట్టింది.
అనకాపల్లి పట్టణ వాసులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని పంచేందుకు ‘శుభప్రదం షాపింగ్ మాల్’ అత్యంత వైభవంగా అడుగుపెట్టింది. స్థానిక శ్రీ సత్య థియేటర్ సమీపంలోని మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ భారీ మాల్‌ను ఏప్రిల్ 3, శుక్రవారం ఉదయం ప్రముఖ సినీ తారలు మానస వారణాసి, శ్రీదేవి జాబిలి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. గ్లామరస్ హీరోయిన్ల రాకతో ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగగా, అభిమానులు మరియు స్థానికుల కోలాహలంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.
ఈ శుభ సందర్భంలో రాజకీయ ప్రముఖులు విశిష్ట అతిథులుగా విచ్చేసి మాల్ నిర్వాహకులను అభినందించారు. అనకాపల్లి ఎంపీ శ్రీ సీఎం రమేష్, శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్రరావు మరియు జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ భీమరశెట్టి రాంకీ తదితరులు ఈ వేడుకలో పాల్గొని, అనకాపల్లి వంటి పెరుగుతున్న నగరానికి ఇలాంటి అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ రావడం శుభపరిణామమని కొనియాడారు.
సంస్థ అధినేత శ్రీ అల్లాక సత్యనారాయణ గారు మాట్లాడుతూ, హైదరాబాద్ వంటి మహానగరాలలో ఉండే షాపింగ్ అనుభూతిని, అత్యాధునిక హంగులను అనకాపల్లి ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ మాల్‌ను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. నమ్మకమైన నాణ్యత, సామాన్యుడి బడ్జెట్‌కు సరిపోయే ధరలు, మరియు మార్కెట్లో మరెక్కడా లభించని వినూత్న డిజైన్లు తమ ప్రత్యేకతని ఆయన వివరించారు. ముఖ్యంగా కుటుంబంలోని సభ్యులందరికీ కావాల్సిన వస్త్రశ్రేణి, బ్రాండెడ్ కలెక్షన్స్ మరియు ట్రెండీ వేర్ ఒకే చోట లభించడం వినియోగదారులకు గొప్ప వెసులుబాటు అని తెలిపారు. కేవలం వ్యాపారమే కాకుండా, సుమారు వంద మందికి పైగా స్థానిక యువతకు ఈ మాల్ ద్వారా ఉపాధి కల్పించడం తమకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ, తమను ఆదరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
విశాలమైన షాపింగ్ స్పేస్, అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ మాల్లో ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు మరియు భారీ డిస్కౌంట్లను ప్రకటించారు. ఫ్యాషన్ ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త స్టాక్‌ను అందుబాటులో ఉంచుతామని, షాపింగ్ చేయడమనేది ఒక పండుగలా అనిపించేలా సేవలందిస్తామని నిర్వాహకులు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. “మీ కుటుంబం ఇక సంతోషం – మీ పరిసరం ఇక శుభప్రదం!” అనే నినాదంతో అనకాపల్లి షాపింగ్ రంగంలో శుభప్రదం షాపింగ్ మాల్ ఒక కొత్త శకానికి నాంది పలికింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

