అంటిగ్వా: వెస్టిండీస్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్వైట్కు ఈడెన్ గార్డెన్స్‌కు విడదీయరాని సంబంధం. అవును సరిగ్గా ఆరేండ్ల క్రితం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విండీస్‌ను విజేతగా నిలిపాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ బ్రాత్‌వైట్..విండీస్‌కు ప్రపంచకప్ అందించాడు. ఈడెన్‌పై తనకున్న మక్కువను చూపిస్తూ తన ముద్దుల తనయకు ‘ఈడెన్ రోజీ బ్రాత్‌వైట్’ అని పేరు పెట్టాడు. ‘గుర్తుపెట్టుకోండి నా కూతురు పేర’ అంటూ బ్రాత్‌వైట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు.