హీరో సుమంత్ నటిస్తున్న సినిమా ‘అహం రీబూట్’. ఈ సినిమాలో ఆయన రేడియో జాకీ పాత్రలో కనిపించనున్నారు. వాయుపుత్ర ఎంటరె్టైన్మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు. సుమంత్ లుక్ కొత్తగా ఉందని ప్రశంసిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ సాగర్ అట్లూరి మాట్లాడుతూ..‘సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. అనుకోని సంఘటనలు మనలోని శక్తులను ఎలా బయటకు తీసుకొస్తాయి అనే కాన్సెప్ట్‌తో సినిమాను రూపొందించాం’ అన్నారు. ‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్ మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తాం’ అన్నారు నిర్మాత రఘువీర్ గోరిపర్తి. ఈ చిత్రానికి సంగీతం : శ్రీరామ్ మద్దూరి, సినిమాటోగ్రఫీ : వరుణ్ అంకర్ల.